తేది 30.5.22,నల్గొండ. జూన్ 3 నుండి ప్రారంభం కానున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు

సోమవారం హైదరాబాద్ నుండి పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పల్లె ప్రగతి కార్యక్రమం పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ జూన్ 3 నుంచి నుంచి పదిహేను రోజులపాటు నిర్వహించే పల్లె ప్రగతి  కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత, హరితహారం మొక్కలు నాటే స్థలాలను గుర్తించడం విద్యుత్ సమస్యలు, తెలంగాణ గ్రామీణ క్రీడ ప్రాంగణాల ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు .అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత పల్లె ప్రగతి ఈ కార్యక్రమంలో సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకొని జూన్ 3 నుంచి ప్రారంభం కానున్న ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతో విజయవంతానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత తో పాటు, రహదారుల వెంట మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. వైకుంఠ ధామం లకు, నీటి సౌకర్యం విద్యుత్ సరఫరా తో పాటు, విద్యుత్ స్తంభాలను సరిచేయడం వంటి ఇతర విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలు మండలం కు రెండు చొప్పున జూన్ 2న ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారిని కాళిందిని,డి.పి. ఓ.విష్ణు వర్ధన్ తదితరులు పాల్గొన్నారు

జూన్ 3 నుండి ప్రారంభం కానున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు

Share This Post