తేది 7.11.2021 రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో పౌరసరఫరాల శాఖ, రైస్ మిల్లర్లతో ధాన్యం కొనుగోళ్లపై ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అదనపు కలెక్టర్ జీవి శ్యాం ప్రసాద్ లాల్.

పత్రికా ప్రకటన

తేదీ 07- 11-2021

కరీంనగర్
వరి ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలి

రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలి.

అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్.
o0o

వాన కాలంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని గ్రామాలలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగవంతంగా కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు.

ఆదివారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు, పౌరసరఫరాల శాఖ సిబ్బంది తో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాన కాలంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధర పై కొనుగోలు చేయుటకు జిల్లాలో 351 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు . జిల్లాలో ఇంత వరకు 116.14 కోట్ల విలువగల 59,256 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో గన్ని బ్యాగులకు కొరత లేదని ఇంతవరకు 32 లక్షల 50వేల గన్నీ బ్యాగులను కొనుగోలు కేంద్రాలకు పంపిణీ చేశామని తెలిపారు. ఇంకనూ 26,75,291 గన్ని బ్యాగులు గోడౌన్లో అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు. కొనుగోలు కేంద్రాల నుండి లారీల ద్వారా కేటాయించిన మిల్లులకు పంపించిన ధాన్యాన్ని సంబంధిత రైస్ మిల్లర్లు వెంటనే దించు (అన్ లోడు ) కోవాలని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా రైస్ మిల్లర్లు సహకరించాలని ఆయన కోరారు. రైతులు ఆరబెట్టి శుభ్రం చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి కనీస మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు.

ఈ సమావేశంలో పౌర సరఫరాల సంస్థ డిఎం శ్రీకాంత్ రెడ్డి, రైస్ మిల్లర్ల జిల్లా అధ్యక్షులు బచ్చు భాస్కర్, కార్యదర్శి అన్నమనేని సుధాకర్ రావు , రైస్ మిల్లర్లు , పౌర సరఫరాల సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్.

 

Share This Post