తేది 9-9-2021 న కరీంనగర్ పట్టణం లోని స్వశక్తి కళాశాలలో యూనిసెఫ్ ఆధ్వర్యంలో లో ఆదర్శ సుస్థిర పారిశుధ్య గ్రామాల సాధన అనే అంశం పై సర్పంచ్ లకు పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమం లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్.

పత్రికా ప్రకటన తేదీ:9-9-2021

సుస్థిర పారిశుద్ధ్యంలో జిల్లా… రాష్ట్రానికే రోల్ మోడల్

ప్రగతి ద్వారా నిరంతర సుస్థిర పారిశుద్ధ్యం సాధ్యపడుతుంది

జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్
00000

 

సుస్థిర పారిశుద్ధ్యంలో కరీంనగర్ జిల్లా రాష్ట్రానికే రోల్ మోడల్ గా నిలిచిందని పల్లె ప్రగతి ద్వారా నిరంతర సుస్థిర పారిశుద్ధ్యం సాధ్యపడు తుందని జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ అన్నారు.

గురువారం స్థానిక స్వశక్తి కళాశాలలో యూనిసేఫ్ సహకారంతో ఆదర్శ సుస్థిర పారిశుద్ధ్య గ్రామాల సాధన అనే అంశంపై జిల్లాలోని 55 గ్రామాల సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇదివరకు ఓడిఎఫ్ సాధనకు సర్పంచులు కృషి చేశారని, ఇప్పుడు గ్రామాల్లో సుస్థిర పారిశుద్ధ్యం సాధించేందుకు కృషి చేయాలని, ఇందుంకోసం ప్రభుత్వం తన వంతు సహకారం అందిస్తుందని తెలిపారు. గ్రామాలకు తగినన్ని నిధులు సమకూర్చడంతో పాటు ట్రాక్టర్, కంపోస్ట్ షెడ్, చెత్తబుట్టలు, ట్రై సైకిల్లు, అందిస్తూ నిరంతరమూ పారిశుద్ధ్యం మెరుగుపడేలా చూస్తామని తెలిపారు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహంతో మీ వంతు కృషి చేస్తూ గ్రామాలను సుందరి- కరంగా మార్చాలని కలెక్టర్ సర్పంచులను, పంచాయతీ కార్యదర్శులను కోరారు అనంతరం తడి, పొడి చేత్తకు సంబంధించిన పోస్టర్, యూనిసేఫ్ సహకారంతో ముద్రించిన పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ గరిమ అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జడ్పీ సీఈవో ప్రియాంక, డి ఆర్ డి ఓ శ్రీలత, డి పి ఓ వీర బుచ్చయ్య, యూనిసేఫ్ రాష్ట్ర ప్రతినిధి చంద్రశేఖర్, జిల్లా సమన్వయకర్త కిషన్ స్వామి, స్వచ్ఛభారత్ సమన్వయకర్తలు రమేష్, వేణు వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పొరసంబందాల శాఖ కార్యాలయం కరీంనగర్ గారిచే జారీచేయడం అయినది.

Share This Post