తేది06.09.2021 చిన్నారులకు పోషణ లోపం నుంచి విముక్తి కల్పించడానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు.

ప్రెస్ రిలీజ్. తేది06.09.2021 చిన్నారులకు పోషణ లోపం నుంచి విముక్తి కల్పించడానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పోషణ్ అభియాన్ పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లలను సంపూర్ణ ఆరోగ్యవంతులను తయారు చేసే విధంగా చూడాలన్నారు. పోషణ మాసం సందర్భంగా ఈనెల 30 వరకు గ్రామాల్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఎదుగుదల తక్కువ ఉన్న పిల్లలను గుర్తించి వారికి పౌష్టికాహారం అదేవిధంగా చూడాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పోషణ లోపాలు ఉన్న పిల్లలను గుర్తించి వారికి పౌష్టికాహారం అందే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. సరైన పోషణ అందే విధంగా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పోషణ అభియాన్ లో జిల్లాను మొదటి స్థానంలో నిలిచే విధంగా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రతిజ్ఞ చేశారు. కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, సి డి ఎస్ పి డి సరస్వతి, జిల్లా వ్యవసాయ అధికారి ని భాగ్యలక్ష్మి, విద్యాశాఖ అధికారి రాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. Dpro..Kama reddy.

Share This Post