తేది23.08.2021 జిల్లాలో నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు.

ప్రెస్ రిలీజ్. తేది23.08.2021

జిల్లాలో నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నులిపురుగుల మాత్రల పంపిణీపై అవగాహన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ, ఐ సి డి ఎస్, విద్య, వైద్య, గ్రామపంచాయతీ అధికారులు సమన్వయంతో మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సూచించారు. అంగన్వాడి, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి 19 ఏళ్ల లోపు పిల్లలకు అల్బండజోల్ మాత్రలు అందించి అవగాహన కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా కరపత్రాలను, మాత్రలను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, డి పి ఓ సునంద, అధికారులు పాల్గొన్నారు. Dpro..Kamareddy

Share This Post