తేదీ.01.9.2021. సూర్యాపేట. ఆరోగ్య సమాజమే లక్ష్యంగా పనిచేయాలి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా మెరుగైన సేవలు అందాలి. అన్ని శాఖలు భాగస్వాములు కావాలి. అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు.

  1. ఆరోగ్య సమాజమే లక్ష్యంగా పనిచేయాలని అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు అన్నారు. బుదవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పి.డి. ఐసీడీఎస్ జ్యోతి పద్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన పోషణ అభియాన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మహిళ సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తూ పోషణ అభియాన్ 2018 సంవత్సరంలో ప్రారంభించబడిందని సెప్టెంబర్ 1 నుండి 30 వరకు నిర్వహిస్తున్న పోషణ మాసంలో రక్తహీనత, పౌష్ఠిక ఆహారం లోపం , తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశాలపై మహిళలో అవగాహన కల్పించాలని అన్నారు. ఈ పోషణ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం చిన్న పిల్లలు, మహిళల్లో పోషకాహార లోపాన్ని గుర్తించి పరిష్కరించడం అన్నారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, పసి పిల్లలకు పోషక విలువలతో కూడిన పౌష్ఠిక ఆహారం అందించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో ఐసీడీఎస్ ద్వారా అందిస్తున్న సేవల పై ప్రజలలో పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని అన్నారు. ముఖ్యంగా బాల్య వివాహాల ను అరికట్టాలని అలాగే పిల్లల తల్లిదండ్రులకు పిల్లల బాల్య వివాహాల వలన జరిగే నష్టం పై వివరించాలని తెలిపారు. కిషోర్ బాలికల్లో రక్తహీనత పై అరోగ్య సలహాలు అందించాలని అలాగే జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో ఈ పోషణ మాసం సందర్భంగా పోషణ వాటికలు ఏర్పాటు చేసి తద్వారా పోషక ఆహారం లోపం లేకుండా చూడాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇప్పటికే 14 శాఖలు భాగస్వామ్యంతో పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ జిల్లాలో మెరుగైన సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా నేపద్యంలో గర్భిణీలు, బాలింతలకు వ్యాక్సిన్ అందించాలని అలాగే సేంద్రియ పంటల ద్వారా పండించే పౌష్ఠిక ఆహారాన్ని అందించాలని ఈ సందర్భంగా సూచించారు. అనంతరం పౌష్ఠిక ఆహారం సూచనలకు సంబందించిన గోడ పత్రికను ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో పి.డి. కిరణ్ కుమార్, డి.యస్. ఓ విజయ లక్ష్మి, డి. ఏ. ఓ రామారావు నాయక్, DMHO Dr. కోటా చలం, dio dr. వెంకట రమణ, ఏ. ఓ శ్రీదేవి,పోషణ అభియాన్ జిల్లా కో ఆర్డినేటర్ పి. సంపత్, వివిధ శాఖల అధికారులు , cdpo, సూపర్ వైజర్ లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post