తేదీ.02.9.2021. సూర్యాపేట. దాతల సేవా దృక్పథం వెల కట్టలేనిది. హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణానికి ముందుకొచ్చిన రాచెం ఫార్మా కంపెనీ. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

 

జిల్లాలో వివిధ సందర్భాలలో ముందుకొచ్చి దాతలు తమవంతు సహాయ సహకారాలు అందించుట అభినంద నియమమని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ నందు రాచేం ఫార్మా సంస్థ యాజమాన్య ప్రతినిధి పూసపాటి రవి కుమార్ దొండపాడు ఆవాస గ్రామమైన గాంధీ నగర్ తండ లో హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణా పనులకు సి.యస్.ఆర్. నిధుల నుండి రూ. 16 లక్షల రూపాయలకు సంబందించిన ప్రతిపాదనలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ గాంధీ నగర్ తండ హెల్త్ సబ్ సెంటర్ పనులను టి.యస్. యం. ఐ.డి.సి నిర్మాణ సంస్థ ద్వారా త్వరలో చేపట్టడం జరుగుతుందని తదుపరి చెల్లింపులు రా చేం ఫార్మా లిమిటెడ్ ద్వారా జరుగునని తెలిపారు. జిల్లా పై మమకారంతో దాతలు ముందుకొచ్చి అయా సందర్భాలలో తమవంతు సహకారం అందించడం అభినందనీయం నియమని అన్నారు. ప్రజల అరోగ్య రీత్యా సేవలందించేందుకు ముందుకొచ్చిన రాచెం ఫార్మా లిమిటెడ్ యాజమాన్య ప్రతినిధి పూసపాటి రవి కుమార్ కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు, DMHO dr. కోటా చలం, డి.పి.ఓ N.H. కిరణ్. తదితరులు పాల్గొన్నారు.

Share This Post