తేదీ: 04.06.2022. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం నాడు జిల్లా కలెక్టర్ , మేజిస్ట్రేట్ శ్రీమతి పమేలా సత్పతి హైరిస్క్ గ్రూపు కొరకు ఏర్పాటు చేసిన NCD మరియు గైనిక్ స్క్రీనింగ్ క్యాంప్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దురలవాట్లకు దూరంగా ఉండడం వలన వాటి ద్వారా వచ్చే వ్యాధులను నివారించవచ్చు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. కె. మల్లికార్జున రావు మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ZP చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్రీ దీపక్ తివారి, , DCHS డా. చిన్న నాయక్, Dy.DM&HO భువనగిరి డా.ప్రశాంత్, ప్రోగ్రామ్ ఆఫీసర్ FP & RBSK డా. వినోద్, Dy. DM&HO చౌటుప్పల్ డా. యశోదా, ప్రోగ్రామ్ ఆఫీసర్ NCD డా.సుమన్ కళ్యాణ్ మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా నెలవారీ సమీక్షా సమావేశం:

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.కె. మల్లికార్జున రావు ఆధ్వర్యంలో నెలవారి సమీక్ష సమావేశం PHC సూపర్వైజర్లకు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని ఆరోగ్య సూచికలలో ముందు ఉండాలని సరైన సమయంలో గర్భిణీలను నమోదు చేసి అందరూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే పరీక్షలు చేయించుకొని కాన్పులు కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో జరిపించాలని సిజేరియన్లు తగ్గించాలని సాధారణ కాన్పు పెంచాలని తెలిపినారు. ఈ నేలను మలేరియా మాసోత్సవంగా జరుపుకుంటున్నామని, మరియు, NCD, TB, కుష్టు వ్యాధిల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. జిల్లాను వైద్య రంగంలో ముందుంచే బాధ్యత ఎరిగి పనిచేయాలని తెలియజేశారు. ఈ సందర్భంగా MCP ఫోల్డర్లను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో Dy. DM&HO భువనగిరి డా.ప్రశాంత్, ప్రోగ్రామ్ ఆఫీసర్ FP&RBSK డా. వినోద్, Dy. DM&HO చౌటుప్పల్ డా. యశోదా, ప్రోగ్రామ్ ఆఫీసర్ NCD డా. సుమన్ కళ్యాణ్ మరియు సూపర్ వైజర్స్ పాల్గొన్నారు.

Share This Post