తేదీ.06.5.2022. సూర్యాపేట. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి. ప్రయాణికులకు సదస్సుల ద్వారా అవగాహన కల్పించాలి. హైవే లపై నిరంతరం పెట్రోలింగ్ ఉండాలి. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

జిల్లాలోని హైవే రోడ్ల ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రోడ్ల ప్రమాదాల నివరణకై చేపట్ట వలసిన చర్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన 19 ప్రాంతాలలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆదిశగా పటిష్టమైన నివారణా చర్యలు చేపట్టాలని సూచించారు. తరుచుగా గుర్తించిన ప్రాంతాలలో స్పీడ్ లేజర్ గన్స్ ఏర్పాటు చేయలని అన్నారు. ముఖ్యoగా ప్రయాణికులు, పాఠశాలలు, కలశాలల వాహనాల డ్రైవర్లకు సదస్సుల ద్వారా ప్రమాదాల నివారణ పై అవగాహన కల్పించాలని అన్నారు. రోడ్లపై ప్రయాణించే ప్రతి వాహన చోదకుడు హెల్మెన్ట్ తప్పనిసరిగా వినియోగించేలా అలాగే బైక్ లపై యువత స్పీడ్ ను కట్టడి, మద్యం సేవించి వాహనాలు నడపకుండా గట్టి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పట్టణాల్లో ఉన్నటువంటి రోడ్లలో స్పీడ్ బ్రేకర్స్, మార్కింగ్ విధానం పరిశీలించి నివేదికలను అందించాలని సూచించారు. హైవే, పట్టణ ప్రాంతాలలో వాహన తనిఖీల సమయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పక పాటించాలని వాహనదారులకు బ్రీత్ ఎనలైజేర్ ద్వారా పరిశీలించి కేసులు నమోదు చేయాలని అన్నారు. హైవే పై ఉన్న సర్కిల్స్, యూటర్న్స్ ప్రాంతాలలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని నివారణకై పటిష్ట చర్యలు చేపట్టాలని నిరంతరం హైవేలపై పెట్రోయింగ్ ఉండాలని ఆదేశించారు. అదేవిదంగా హైవే లపై స్పీడ్ కంట్రోల్ విధానం తప్పక పాటించే విదంగా గట్టి చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే హైవే లపై రబ్బర్ స్టిక్స్, లైటింగ్, స్పీడ్ లేజర్ గన్స్ ఉండాలని జాతీయ రహదారుల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే జాతీయ రహదారులపై గుర్తించిన 29 ప్రాంతాలలో సంబంధిత శాఖల అధికారులు రెండు రోజులు పర్యటించి ప్రమాదాలకు గల కారణాలు తదితర అంశాలపై పూర్తి స్థాయి నివేదికతో వచ్చే బుధవారం ఏర్పాటు చేసే సమావేశానికి హాజరై పలు అంశాలపై వివరించవలసి ఉంటుందని ఆదిశగా తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో N. H. 65, సూర్యాపేట టేకుమట్ల నుండి కోదాడ వరకు 63 కిలో మీటర్లు, N. H.167 నేరేడుచర్ల నుండి కోదాడ 42 కిలోమీటర్లు, N. H. 365 బి సూర్యాపేట నుండి తిరుమలగిరి 39 కిలోమీటర్లు, N. H 365 బి బి సూర్యాపేట నుండి మోతె 29 కిలోమీటర్ రహదారులపై ప్రమాదాల నివారణకై పటిష్ట చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఈ సందర్బంగా ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆర్టిఓ వెంకట రెడ్డి, కోడాడ డి.యస్.పి. రఘు, DMHO dr. కోటా చలం, MVI వీరేంద్ర నాయక్, వెంకటయ్య, ఆనంద్ శ్యామ్ ప్రసాద్, ఆర్.బాబు, బి.దీప్తి, NHAI , GMR, R & B, పి.ఆర్., ఎక్సజ్, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post