తేదీ.07.5.2022. సూర్యాపేట. దళితుల జీవితాల్లో నూతన వెలుగులు. దళితుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం. లబ్దిదారులకు యూనిట్ల అందుచేత. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.

దళితుల జీవితాల్లో ప్రభుత్వం నూతన వెలుగులు నింపుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సి.యం. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బందు యూనిట్లను శనివారం రాత్రి పట్టణంలోని 25, 37, 45వ వార్డుల్లో సూర్యాపేట పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ లతో కలసి ప్రారంభిచి అందచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏమైతే కోరుకున్నారో అవన్నీ ముఖ్యమంత్రి కెసిఆర్ సాకారం చేస్తున్నారని అన్నారు. నేడు దళిత బంధు పథకంతో దళితులు ఆర్థికాభివృద్ధి సాధించి తద్వారా సమాజంలో ఉన్నతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి ఉప్పల లలిత ఆనంద్, కమిషనర్ రామనుజుల్స్ రెడ్డి, 25 వ వార్డు కౌన్సిలర్ ఆకుల కవితలవకుశ, 45 వ వార్డు గండూరి పావనికృపాకర్,17వ వార్డు కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహాజన్, నాయకులు ఆకుల లవకుశ, గండూరి కృపాకర్, ఉప్పల ఆనంద్, పిడమర్తి శంకర్, దుర్గాప్రసాద్, ఉట్కూరు సైదులు, మున్సిపల్ కో ఆప్షన్ నెంబర్ రియాజ్, మహిళా నాయకురాలు కరుణశ్రీ, సల్మా మస్తాన్, దండు రేణుక, విజయ, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Share This Post