తేదీ.09.5.2022. సూర్యాపేట. దళితుల జీవితాల్లో నూతన ఒరవడి. దళిత బందు లబ్దిదారులతో కలసి సహపంక్తి భోజనం. దళితుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. లబ్దిదారులకు యూనిట్ల అందుచేత. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.

దళితుల జీవితాల్లో నూతన ఒరవడి కనబడుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సి.యం. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బందు యూనిట్లను రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తో కలసి చివ్వేంల మండలం తుల్జారావు పేటలో ప్రారంభిచి లబ్దిదారులకు అందచేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏమైతే కోరుకున్నారో అవన్నీ ముఖ్యమంత్రి కెసిఆర్ సాకారం చేస్తున్నారని అన్నారు. నేడు దళిత బంధు పథకంతో దళితులు ఆర్థికాభివృద్ధి సాధించి తద్వారా సమాజంలో ఉన్నతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. వాహనాలు అందుకున్న లబ్ధిదారులు డ్రైవింగ్ సమయంలో పలు జాగ్రత్తలు పాటించాలని ఆర్థిక వనరులు పెంచుకోవాలని అలాగే డైరీ , షిప్ పథకాలు పొందిన లబ్ధిదారులు పశుగ్రాసం తప్పక పెంచుకోవాలని సందర్బంగా సూచించారు. లబ్దిదారులకు ఈ సందర్బంగా డైరీ,షీప్, ట్రాక్టర్, టాటా , అశోక్ లిలాండ్ మినీ వాహనాలు అందించారు. అనంతరం దళిత బందు లబ్దిదారులతో కలసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం షేడ్స్ ను నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.

 

51 కుటుంబాలకు కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులు పంపిణీ.

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.

పేదింటి ఆడపిల్లల కుటుంబాలకు కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పధకం ఎంతో ఉపయోగ పడుతున్నవాని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం చివ్వేంల మండలంలోని తుల్జారావుపేట, దూరాజుపల్లి, గుంజలూరు, తిరుమలగిరి, వల్లబాపురం, ఉంద్రుడుకొండ, మోదినాపురం,తిమ్మాపురం గ్రామాలకు చెందిన 51 కుటుంబాలకు రూ.51,05,916 రూపాయల విలువగల చెక్కులను రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తో కలసి లబ్దిదారులకు అందచేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ దారవత్తు కుమారి బాబు నాయక్, జడ్పీటీసీ సంజీవ్ నాయక్, ప్రత్యేక అధికారి శ్రీధర్ గౌడ్, తహసీల్దార్ రంగా రావు, ఎంపీడీఓ యల్. లక్ష్మీ, mpo గోపి, సర్పంచ్ కోటేశ్వర రావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు తదితరు లు పాల్గొన్నారు.

Share This Post