తేదీ.09.5.2022. సూర్యాపేట. వేసవి దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజా అర్జీలను సత్వరమే పరిష్కారించాలి. ప్రజావాణికి హాజరుకాని అధికారులపై చర్యలు. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

 

 

జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా పెరుగుతున్నందున ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు తో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా చిన్న పిల్లలు, వృద్ధులు ఇండ్ల నుండి బయటకు రాకుండా చూడాలని అలాగే అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వడదెబ్బ నివారణకు ఓ ఆర్ యస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులు ఆదేశించారు. వైద్యులు, పంచాయతీ అధికారులు నిరంతరం క్షేత్ర స్థాయి పర్యటనలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామాలలో ఉపాది పనులను ఎక్కువగా కల్పించాలని ఇజియస్ సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యాoగా గ్రామ పంచాయతీల ద్వారా గ్రామాలలో పశువుల కు నీటి తొట్లలో నీటి సదుపాయం ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిదంగా అన్ని నర్సరీలలో ఉన్న మొక్కల సంరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని జి.పి. అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో ప్రజల నుండి అందిన అర్జీలను సంబంధిత అధికారులు తక్షణమే పరిశీలించి చర్యలు చేపట్టాలని సూచించారు. ధరణి వెబ్ సైట్ నందు భూమి యొక్క స్థితిగతులను సంబంధిత దరఖాస్తు దారులకు ఎప్పయికప్పుఫు వివరించడం జరుగుతుందని తద్వారా సత్వరమే అర్జీదారుల సమస్యలను పరిష్కరం అవుతున్నదని అన్నారు. ప్రజావాణికి హాజరు కానీ జిల్లా అధికారులపై చర్యలుతప్పవని సూచించారు. ప్రజావాణిలో భూ సమస్యల పై 13, ఇతర శాఖలకు సంబంధించి 11 మొత్తం 24 దరఖాస్తులు అందాయని అన్నారు. మట్టంపల్లి మండలం పెదవీడు గ్రామంలో స్మశాన వాటిక ఇబ్బందులపై గ్రామ ప్రజలు కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోగా తక్షణమే తహసీల్దార్ తో మాట్లాడి నివేదిక అందించాలని తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

పంట కోత ప్రయోగాలు ఎక్కువగా చేపట్టాలి.

జిల్లాలో పంట కోత ప్రయోగాలు ఎక్కువగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం పంట కోత ప్రయోగాలకు చేపట్టే కిట్లను అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు, సి.పి.ఓ జి. వెంకటేశ్వర్లుల తో కలసి మండల గణాంక, ప్రణాళికా అధికారులకు అందించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిరంతరం పంటకోత ప్రయోగాలు జరగాలని తద్వారా ప్రభుత్వానికి నివేదికలు అందచేయడం జరుగుతుందని కలెక్టర్ ఈ సందర్బంగా అన్నారు.
ఈ కార్యక్రమంలో డి.పి.ఓ యాదయ్య, సి.పి.ఓ జి. వెంకటేస్వర్లు, సంక్షేమ అధికారులు జ్యోతి పద్మ, అనసూర్య, యస్.ఓ వి. శ్రీనివాస రావు, పర్యవేక్షకులు పులి సైదులు, దున్న శ్యామ్, యం. రాజేశ్, కిషన్, బి. లింగయ్య, అర్జీదారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post