జిల్లాలో హెయిర్ కటింగ్ సెలూన్లు, దోబీ ఘాట్ లు, లాండ్రీ షాపులకు ప్రభుత్వం కల్పించిన 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకంలో రజక, నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన లబ్దిదారులు అందరూ లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ నందు నాయి బ్రాహ్మణ, రజక కుల సంఘాలు, అధికారులతో ఏర్పాటు చేసిన 250 ఉచిత విద్యుత్ పై ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు తో కలసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నిర్వహిస్తున్న హెయిర్ కటింగ్ సెలూన్లు, దోబీ ఘాట్ లు, ల్యాండ్రీ షాపులకు ప్రభుత్వం ప్రకటించిన 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆదిశగా అదికారులు, కుల సంఘాలు ప్రత్యేక శ్రద్ద చూపాలని సూచించారు. ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్క షాప్ యజమాని లబ్ధి పొందేలా తగిన చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ అధికారి ఉపేందర్ ను అలాగే విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు రజక కులస్థుల నుండి 487, నాయి బ్రాహ్మణ కులస్థుల నుండి 400 దరఖాస్తులు అందాయని తెలిపారు. కుల వృత్తులు చేసే ప్రతి ఒక్కరికీ 250 యూనిట్ల వరకు ఉచితం అనే విషయాన్ని వారికి తెలిసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామ, మండలలాలో వసతి గృహ అదికారులు, విద్యుత్ శాఖ అధికారుల ద్వారా లబ్ధిదారులకు లబ్ధి చేకూరేలా అవగాహన కల్పించాలని సూచించారు. పట్టణ ప్రాంతాలలో ప్రతి ఒక్క షాప్ కు విషయం తెలిసేలా బి.సి. సంక్షేమ శాఖ, విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవాలని, పాత కనెక్షన్ ఉన్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేలా, కొత్తవారు కూడా ఎక్కువగా కనెక్షన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, పేదలకు లబ్ధి చేకూరేలా అధికారులు క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచించారు. జిల్లాలో ప్రస్తుతం 250 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధి పొందుతున్న వారి వివరాలు అందించాలని బి.సి. సంక్షేమ శాఖాధికారిని ఆదేశించారు. మండల,పట్టణ, గ్రామ పంచాయతీ పరిధిలో లబ్ధి పొందేందుకు ఎంతమంది ఉన్నారో పరిశీలించాలని, వారందరూ దరఖాస్తు చేసుకునేలా చూడాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ నుండి వచ్చే బిల్లులో 250 యూనిట్ల వరకు బిల్లు మాఫీ అయినదీ లేనిదీ పరిశీలించాలని బి.సి. సంక్షేమ, విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు.
ఈ సమావేశంలో బి.సి. సంక్షేమ శాఖ అధికారి ఉపేందర్, వసతి గృహ అదికారులు,కుల సంఘాల అధ్యక్షులు చెరుకు వెంకన్న, ….జయమ్మ, నాంపల్లి సైదులు, వీరస్వామి,నర్సయ్య, మాచర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు