తేదీ 1.11.2021 రోజున ఎస్.ఆర్.ఆర్ కళాశాలలో పత్రికా విలేకరులతో మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్

 

నేడే హుజురాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు

ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధం
ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఓట్ల లెక్కింపు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ .వి కర్ణన్

0000

నేడే హుజురాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు అని , ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు తెలిపారు. మంగళవారం ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ అండ్ పిజీ కాలేజీలో హుజరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్ల ఏర్పాట్లపై పాత్రికేయుల తో మాట్లాడారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజరాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా పకడ్బందీగా నిర్వ ఇస్తామని అని తెలిపారు మంగళవారం ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి ఓట్ల లెక్కింపు పై శిక్షణ ఇచ్చామని తెలిపారు. రాజకీయ పార్టీల అభ్యర్థుల ఏజెంట్లకు పాసులు జారీ చేశామని తెలిపారు. హుజరాబాద్ ఉప ఎన్నికల బరిలో 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని ఆయన తెలిపారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ ఓట్లు లెక్కిస్తామని అన్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు 2 హాల్ లలో నిర్వహిస్తున్నామని, ఒక్కొక్క హాల్ లో 7 టేబుల్ ల చొప్పున రెండు హాల్స్ లో 14 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఒక రౌండ్ లో ఒక హాల్ లో 7 పోలింగ్ స్టేషన్లు, మరోక హాల్ లో 7 పోలింగ్ స్టేషన్ల కు సంబంధించిన ఓట్లను ఒకేసారి లెక్కించబడుతుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ 22 రౌండ్ లలో పూర్తి అవుతుందని తెలిపారు . ఎన్నికల ఓట్ల లెక్కింపు ఒక టేబుల్ కు కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ మొత్తం ముగ్గురు చొప్పున ఉంటారని ఆయన తెలిపారు. మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని తెలిపారు కేంద్ర ఎన్నికల సంఘం సంఘం ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు పగడ్బందీగా అమలు చేస్తున్నామని, సిబ్బంది అందరూ మాస్కులు ధరించే లా తగిన ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు.

 

 

Share This Post