తేదీ.10.5.2022. సూర్యాపేట. పేదింటి ఆడపిల్లలకు వరం కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకం. సూర్యాపేట నియోజక వర్గంలో 8 వేల కోట్ల అభివృద్ధి పనులు. అభివృద్ధిలో పల్లెలు పట్టణాలకు పోటీగా నిలుస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి. 31 గ్రామాల 214 మందికి కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ. మండలంలో పి.ఆర్. రోడ్లు, బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.

జిల్లాలో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం చివ్వేంల మండలంలోని పంచాయతీ రాజ్ ద్వారా రూ. 2 కోట్ల 10 లక్షల రూపాయలతో మొగ్గాయి గూడెం చంద్రు పట్ల బి.టి. రోడ్డు పనులకు అలాగే రూ. కోటి 45 లక్షలు బిడ్జ్ నిర్మాణ పనులకు, రూ.2 కోట్ల 16 లక్షల తో చివ్వేంల నుండి ఖాసీం పేట రోడ్డు, చివ్వేంల లో రూ. 50 లక్షలతో చేపట్టే యస్.సి. కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు అలాగే రూ. లైబ్రరీ భవంతి నిర్మాణ పనులకు మంత్రి పలు కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపనలు చేశారు. చివ్వేంల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కళ్యాణాలక్ష్మి, షాది ముబారక్ పథకం పేదింటి ఆడపిల్లలకు వరమని , మహిళ సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, మహిళలు అన్ని రంగాలలో రాణించాలని అన్నారు. చివ్వేంల మండలంలో 31 గ్రామాలకు చెందిన 214 మంది లబ్దిదారులకు రూ. 2 కోట్ల 14 లక్షల రూపాయల విలువగల చెక్కులను మంత్రి లబ్దిదారులకు అందచేశారు. ప్రజల కొరకు పరిపాలన కొనసాగుతుందని, నాణ్యమైన నిరంతరం విద్యుత్ అందిస్తున్నామని, జిల్లాలో రెండు పంటలకు సాగునీరు అందిస్తున్నామని పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతు బందు, రైతు భీమా, ఆసరా పెన్షన్లు, ఎన్నో అద్భుత పథకాలు అందిస్తున్నామని అన్నారు. ఈ సూర్యాపేట నియోజక వర్గంలో 8 వేల కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగిందని అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలు తెలంగాణ అభివృద్ధి వైపు చూస్తున్నాయని ఈ సందర్బంగా అన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలో నిరంతర విద్యుత్ అందిస్తున్నామని ఇతర రాష్ట్రాలతో విద్యుత్ కోతలు మనం చూస్తున్నామని ఈ సందర్బంగా అన్నారు. గత పాలకులవలన ఎంతో అభివృద్ధి కోల్పోయామని ఈ సందర్బంగా మంత్రి తెలిపారు.

నకిరేకల్ శాసన సభ్యులు మాట్లాడుతూ జిల్లా మంత్రి వర్యులు జిల్లాను ఎంతో అభివృద్ధి చేస్తున్నారు..కరోనా సమయంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు పల్లెలు పట్టణాలకు పోటీగా నిలుస్తున్నాయని దళిత బందు పథకం దేశంలోనే అద్భుత పధకమని ఈ సందర్బంగా అన్నారు.

ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఆర్.డి.ఓ రాజేంద్రప్రసాద్, టి.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జూలకంటి జీవన్ రెడ్డి,ఎంపీపీ ధారవత్ కుమారి బాబు నాయక్,జడ్పీటీసీ సంజీవ నాయక్,మండల పి.ఏ.సి.ఎస్ చైర్మన్ మారినేని సుదీర్ రావు, ఎమ్మార్వో రంగారావు,మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ఎంపిడిఓ లక్ష్మీ,ఎంపిఓ గోపి,ఎంపీటీసీ మిర్యాల పార్వతమ్మ గోవిందా రెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఊట్కూరి సైదులు,కౌన్సిలర్ రవి, మాజీ ఎంపీపీ రౌతు నర్సింహ రావు,ఆయా గ్రామాల సర్పంచ్ లు,ఎంపీటీసీ లు,వార్డు కౌన్సిలర్ లు, జిల్లా నాయకులు,కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Share This Post