తేదీ.10.8.2021. సూర్యాపేట. న్యూమోనియా అరికట్టేందుకు పీసీవీ టీకాలను చిన్నారులకు వేయించాలి. అంగన్వాడీ సిబ్బందిచే పిల్లల వివరాలు సేకరణ. వ్యాక్సిన్ పై అవగాహన కల్పించండి. జిల్లా అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు.

న్యూమోనియా అరికట్టేందుకు పీసీవీ టీకాలను చిన్నారులకు వేయించాలని అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ సదస్సు లో DMHO Dr. కొటాచలం తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
చిన్నపిల్లల్లో వచ్చే ప్రాణాంతక వ్యాధి అయిన న్యూమోనియాను అరికట్టడానికి రాష్ట్రంలో న్యూమోకోకల్​ కాంజువేట్​ వ్యాక్సిన్​ (పీసీవీ) టీకాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12 న ప్రవేశపెడుతుందని తెలిపారు. చిన్నపిల్లల్లో వచ్చే న్యూమోనియాను అరికట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో త్వరలో న్యూమోకోకల్​ కాంజువేట్​ వ్యాక్సిన్​ టీకా అందుబాటులోకి వస్తుందని వివరించారు. జిల్లాలో ఈ టికపై ప్రజలకు ఎక్కువగా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ టీకాను ఆరు వారాల వయసులో మొదటి డోసు, పద్నాలుగు వారాల వయసులో రెండో డోసు, తొమ్మిది నెల వయస్సులో బూస్టర్​ డోస్​ చొప్పున చిన్నారులకు వేయనున్నట్లు వివరించారు. ఈ విషయంలో ఐసీడీఎస్ అధికారులు జిల్లాలోని అంగన్వాడీ సిబ్బంది సహకారంతో పిల్లల వివరాలు సేకరించి ఈ త్వరలో చేపట్టబోయే వ్యాక్సిన్ నిర్వహణ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వివరించాలని ఈ వ్యాక్సిన్ నూరు శాతం సురక్షితమని తెలిపారు. ఇప్పటికే 145 దేశాలలో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నదని ప్రస్తుతం మనదేశంలో కూడా ప్రైవేట్ గా దాదాపు నాలుగు వేలకు దొరుకుతుందని అన్నారు. అంగన్​వాడీ టీచర్లు, ఐసీడీఎస్​ డిపార్ట్​మెంట్​ వారు, సీడీపీవోలు, అంగన్​వాడీ టీచర్లు ఆయా గ్రామాలు, పట్టణాల్లో చిన్నారులకు ఈ టీకాలు అందేలా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి సహకరించాలని వివరించారు. ముఖ్యంగా తల్లి పాలు లేని పిల్లలకు, పోషక ఆహారం లేని పిల్లకుకు ఈ వ్యాది ఎక్కువగా సోకే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం అందించే ఈ పీసీవీ టీకా ఉచితంగా అందచేయనున్నట్లు అలాగే పిల్లలకు ఇచ్చే పది వ్యాధి నిరోధక టీకాలతో పాటు ప్రస్తుతం ఈ టీకా పదకొండవ టీకా అని వివరించారు. ఈ విషయంలో క్షేత్రస్థాయిలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది వైద్య, ఆరోగ్య శాఖకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారిణి డాక్టర్ వెంకట రమణ,DCHS dr. వెంకటేశ్వర్లు, పి.డి. ఐసీడీఎస్ నర్సింహ రావు, మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి, డి.యం. ఓ అంజయ్య, SMO ప్రసాద్, DHE మధుసూధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share This Post