తేదీ.11.8.2021. సూర్యాపేట. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాలి. పారిశుధ్య పనుల పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. హరిత హారంలో నాటిన మొక్కల పై ప్రత్యేక శ్రద్ద చూపాలి. మున్సిపల్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేయాలి. అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్.

పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు చేపట్టి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సంబంధిత అధికారులకు సూచించారు.
సూర్యాపేట పట్టణంలో జరుగుచున్న పారిశుద్ధ్య పనులను జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి తో కలసి బుధవారం వార్డు లలో కలియ తిరిగి పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడి-పొడి చెత్త సేకరణ, సెగ్రిగేషన్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి గృహ యజమాని తప్పని సరిగా తడి-పొడి చెత్త ను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందివ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పల్లే, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆదిశగా ఏపటికప్పుడు చర్యలు చేపట్టాలని సూచించారు. కస్తూరి బజారు నందు సెట్ బ్యాక్ లేకుండా ఇంటి నిర్మాణం చేస్తున్న ఇంటి యజమానికి నోటీస్ జారీ చేయవలసిందిగా ఆదేశించారు, రోడ్డు పై వాహన ,పాదచారులకు ఇబ్బంది కలిగే విధంగా నిర్మాణం చేసిన ర్యాంపు లను తొలిగించవలసిందిగా, ఇండ్ల మధ్య ఖాళీ స్థలం ల యజమానులను స్థలంలు శుభపర్చుకోవలసిందిగా సంబంధిత స్థల యజమానులకు నోటీసులు జారీ చేయవలసినదిగా అధికారులకు ఆదేశించారు. చంద్రన్న కుంట నందు రోడ్ల పై కట్టివేసిన గేదలను ,రాళ్ల ను తీసివేయవలసినదిగా సూచిస్తూ , డబుల్ బెడ్ రూమ్,రాపోలు గుడి ని ప్రాంతాలను పరిశీలించారు. పాత జాతీయ రహదారి పై జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీను వార్డుల కౌన్సిలర్ల తదితరులు పాల్గొన్నారు. i

Share This Post