తేదీ.12.8.2021. సూర్యాపేట. ఆరోగ్య పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అదనపు సంచాలకులు Dr. రవీంద్ర నాయక్.

జిల్లాలో అరోగ్య పథకాలు ప్రజలలో ఎక్కువగా తీసుకెళ్లాలని అదనపు సంచాలకులు dr. రవీంద్ర నాయక్ వైద్యదికారులను అదేశించారు. బుదవారం సూర్యాపేటలో మెడికల్ కళాశాలకు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదనపు సౌకర్యాల మెరుగు కొరకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో కరోనా నిబంధనలు తప్పక పాటించాలని అలాగేవర్షాకాలం లో జ్వరాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నందున ఆదిశగా నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. కాన్సర్ వ్యాధులు గుర్తించడం కొరకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయుటకు పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు. వివిధ వ్యాధులతో మంచాన పడిన వారి కోసం ఎనిమిది పడకల ప్రత్యేక విభాగాన్ని పూర్తి స్థాయిలో చేయుటకు తెలియజేశారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో జిల్లా ప్రోగ్రామ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆరోగ్య పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఆరోగ్యవంతమైన సమాజం కోసం మనం పని చేయాలని ఈ సందర్భంగా కోరారు. వీరి వెంట వైద్య కళాశాల సూపర్డెంట్ మురళీధర్ రెడ్డి, వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కోటా చలం , జె.వి.యస్ శాస్త్రీ, జిల్లా అధికారులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ నాజియ, డాక్టర్ శ్రీనివాసరాజు, డాక్టర్ వెంకట రమణ, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ వినయ్, డాక్టర్ వెంకటపాపి రెడ్డి, డాక్టర్ సాహితీ , కిరణ్, మత్యగిరి ,మదుసుదన్ రెడ్డి, యమున , వీరయ్య, సతీష్ తదితరులు ఉన్నారు.

Share This Post