తేదీ.13.8.2021. సూర్యాపేట. స్వాతంత్ర దినోత్సవ వేడుకల కు పోలీస్ పరేడ్ గ్రౌండ్ ను సిద్దం చేయండి. అదికారులు సమన్వయంతో కలసి పనిచేయాలి. వాటర్ ప్రూఫ్ షామియానాలు ఏర్పాటు చేయాలి. పారిశుధ్య పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలి. కరోనా నిబంధనలు తప్పక పాటించాలి. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఏర్పాట్లను నిర్దేశించిన సమయానికి పూర్తి చేసి అందించాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి అధికారులను అదేశించారు. శుక్రవారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో వేడుకల సందర్బంగా చేపట్టిన పనులను అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావుతో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేడుకల సందర్బంగా స్టేజ్, వి ఐ పి గ్యాలరీలు , స్థాల్స్ పటిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ముందుగా గ్రౌండ్ ను చదును చేసి అందుబాటులోకి తీసుకోవాలని అన్నారు. కరోనా నేపద్యంలో గ్రౌండ్ అంత ముందుగా క్లోరినేషన్ చేయాలని పారిశుధ్య పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలని నిరంతర విద్యుత్, త్రాగునీరు అలాగే సౌండ్ ప్రూఫ్ జనరేటర్ అందుబాటులో ఉంచాలని సూచించారు. పోలీస్ అధికారులు మార్కింగ్ పనులు సూచించిన విధంగా చేపట్టాలని అదేశించారు. వేడుకలను వీక్షించేందుకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించెలా చూడాలని ఆదేశించారు. ఎండ తో పాటు వర్షాలు పడుచున్నండున వాటర్ ప్రూఫ్ శమియానలను ఏర్పాటు చేయాలని సూచించారు. శకటాల ఏర్పాటు తో పాటు సంబంధిత శాఖా అధికారులు, సిబ్బంది వెంట ఉండాలని అలాగే పట్టణంలోని మెయిన్ రోడ్లలో కూడా శకటాల ను గైడ్ ద్వారా ప్రజల సందర్శనార్థం తిప్పాలని సూచించారు. లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందచేటలో సంబంధిత శాఖలు క్రమ పద్దతి నీ పాటించాలని సూచించారు. ముఖ్యంగా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది వేడుకలలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని చేపట్టిన పనుల నివేదికలను అందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అర్.డి. ఓ రాజేంద్ర కుమార్, డి. ఈ మహిపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి, తహశీల్దార్ వెంకన్న, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post