తేదీ.15.8.2021. సూర్యాపేట. అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం. జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి. అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి.

 

జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.

దళిత బంధు పధకం దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని, తెలంగాణ రాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పధకాలను అమలు చేస్తూ దేశంలోనే నెంబర్ వన్ గా తెలంగాణ నిలుస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి, ఎస్పీ ఆర్. భాస్కరన్ తో కలిసి పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి జిల్లాలో జరిగిన అభివృద్ది పనులను వివరిస్తూ ప్రసంగించారు. జిల్లాలో రైతు బంధు పధకానికి ఏకరాకు రూ.5వేల చొప్పున 2లక్షల 52వేల 655 మంది రైతులకు రూ.307 కోట్లు నగదును జమ చేశామని తెలిపారు. మరణించిన1970 మంది రైతు కుటుంబాలకు రైతు భీమా కింద ఇప్పటివరకు రూ.98.50కోట్లు ఇచ్చామన్నారు. రైతు రుణమాఫీ కింద రెండవ విడతలో 50వేల లోపు గల 27, 658 మంది రైతులకు రూ.86.96 కోట్లు మాఫీ చేశామని పేర్కొన్నారు. జిల్లాలో 2వ విడత గొర్రెల పంపిణీలో భాగంగా 17,622 మంది లబ్దిదారులకు రూ.318 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. జిల్లాలో నాలుగు ట్యాంక్ బండ్ నిర్మాణాలకు రూ. 46కోట్లు మంజూరు చేశామన్నారు. అలాగే 42 చెక్ డ్యాం ల నిర్మాణాలకు రూ. 265 కోట్లు ప్రభుత్వం ఆమోదించినట్లు వెల్లడించారు. నాగార్జున సాగర్ ఎడమ లైనింగ్, ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ స్కీమ్, లైనింగ్, జాన్ పహాడ్ లిఫ్ట్ స్కీమ్ పనుల కొరకు రూ. 12వందల కోట్లు మంజూరు చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బి‌సి, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలను అర్హులైన వారందరికి అందిస్తున్నామన్నారు. సి‌ఎం కే‌సి‌ఆర్ హామీలో భాగంగా హుజూర్ నగర్లో ముగ్గురు డాక్టర్లతో ఈ‌ఎస్‌ఐ హాస్పిటల్ మంజూరు చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో 7లక్షల మందికి కోవిడ్ 19 టెస్టులు నిర్వహించగ వారిలో 48వేల మందికి పాజిటివ్ గా గుర్తించి ముందస్తు ట్రీట్మెంట్ అందించాలమని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన మెడికల్ కాలేజ్ లో 2వ బ్యాచ్ అడ్మిషన్లు ప్రారంభించమని అందులో 150మంది విద్యార్డులు సీట్ లబించిందన్నారు. పల్లె ప్రగతి లో భాగంగా సెప్టెంబర్ 2019 నుండి జూన్ 2021 వరకు 475గ్రామ పంచాయితీలలో రూ.208. 26కోట్లతో పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. శాంతి భద్రతల విషయంలో పోలీసుల పనితీరు అభినందనీయమని అన్నారు

అనంతరం రాష్ట్రంతో పాటు జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అబివృధ్ది పనులు, సాధించిన ప్రగతిపై సందేశం ఇచ్చారు. అనంతరం వివిద శాఖల ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాల, స్టాల్స్‌ను ప్రదర్శించారు. అదే విధంగా జిల్లాలో వివిధ శాఖలలో పని చేస్తున్న ఉద్యోగులు, ఆయా మండలాల ప్రజా ప్రతినిధులకు ఉత్తమ సేవా పురస్కార ప్రశంస పత్రాలను అందించారు. అనంతరం విద్యార్థిని, విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎంపి బడుగుల లింగయ్యయాదవ్, జెడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జా దీపికయుగేందర్, అదనపు కలెక్టర్లు మోహన్‌రావు, పాటిల్‌ హేమంత్‌కేశవ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, సూర్యాపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ ఉప్పల లలిత ఆనంద్, జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ ఎస్‌ఎ.రజాక్, తదితర శాఖల అధికారులు, స్వతంత్య్ర సమరయోధులు, పురప్రముఖులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
పరేడ్‌ గ్రౌండ్స్‌లో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శకటాలు చూపరులను ఆకట్టుకున్నాయి. జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ, ఉద్యానవన శాఖ, మున్సిపల్, వ్యవసాయ, వైద్యారోగ్యశాఖ, విద్యాశాఖ, మిషన్‌భగీరథ, రెవెన్యూశాఖ పశుసంవర్ధక శాఖ అటవిశాఖ, మత్స్యశాఖల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శకటాలను ఏర్పాటు చేసి ప్రదర్శించారు. పరేడ్‌గ్రౌండ్‌లో మంత్రితో పాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు తిలకించారు.
– ఉత్తములకు ప్రశంస పత్రాల ప్రధానం
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాలో వివిద శాఖలలో పని చేస్తూ ఉత్తమ ప్రదర్శన కనబర్చిన అధికారులకు, సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు. వీరితో పాటు గ్రామీణాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న ఎంపిపిలు, జెడ్పీటీసీలతో పాటు మరికొంత మంది సర్పంచ్‌లకు ప్రశంస పత్రాలు అందాయి.

విద్యారులచే సాంస్కృతిక ప్రదర్శన..
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులచే నృత్య ప్రదర్శన నిర్వహించారు. జిల్లా బాలకేంద్రంతో పాటు చివ్వెంల ప్రభుత్వ పాఠశాల, మోడల్‌ స్కూల్‌ ఇమాంపేట విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకున్నాయి.

Share This Post