తేదీ.15.9.2021. సూర్యాపేట. స్పెషల్ డ్రైవ్ లో ప్రతి ఒక్కరికీ వ్యాకినేషన్. అదికారులు సమన్వయంతో పనిచేయాలి. ప్రజా ప్రతినిధులను భాగస్వాములు చేయండి. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్ర బెల్లి దయాకర్ రావు.

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో గ్రామ, పట్టణ స్థాయిలలో వంద శాతం కరోనా వాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సూచించారు.

బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పరిషత్ చైర్మన్ లు, జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, పంచాయతీ, మున్సిపాలిటీ, వైద్య అధికారులతో కరోనా వ్యాక్సినేషన్ సమీక్షలో మాట్లాడుతూ, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకొన్నదని‌, ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం ప్రభుత్వ సమర్థత అని అన్నారు. 18 సంవత్సరాలు పైబడినవారు రెండు కోట్ల 80 లక్షల మందికి వాక్సిన్ ఇవ్వాల్సి ఉందని, దీని కోసం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ఛాలెంజ్ గా తీసుకొని దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర స్థానంలో నిలిపిన విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు వాక్సినేషన్ కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ సర్పంచి మొదలుకొని ఎంపీపీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు మెంబర్ల కోఆర్డినేషన్ తో లక్ష్యాన్ని పూర్తి చేయాలని, ప్రతి గ్రామంలో ఆశా, ఏఎన్ఎం తో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో వంద శాతం పూర్తి చేయాలని కోరారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రోజుకు 3 లక్షల వ్యాక్సినేషన్ టార్గెట్ ఇవ్వడం జరిగిందని, దీనిని సాధించాలని అన్నారు. వాక్సినేషన్ కార్యక్రమానికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలలో పాటు రైతు వేదికలు వాడుకోవాలని, రైతు వేదికలలో అన్ని వసతులు ఉన్నాయని తెలిపారు. త్వరగా వంద శాతం పూర్తి చేసిన గ్రామాలకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చి అవార్డులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇప్పటి వరకు రెండు కోట్ల వ్యాక్సినేషన్ దాటిందని, ఇది రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని, ఇదంతా ఒక ప్రణాళికాబద్ధంగా జరిగిందని అన్నారు. 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఇంకా పెంచాలని రోజుకు 3 లక్షల వ్యాక్సినేషన్ పైగా జరగాలని సీఎం గారు‌ ఆదేశించిన నేపథ్యంలో అధికారులందరూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో వాక్సినేషన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, పి హెచ్ సి, సబ్ సెంటర్ వారీగా మైక్రో యాక్షన్ ప్లాన్ తో కార్యాచరణ చేపట్టాలని తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీలో 100% వాక్సినేషన్ వేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని, 100 శాతం పూర్తయిన గ్రామాలలో అభినందన సభ ఏర్పాటు చేసి ప్రోత్సహించాలని, వాక్సినేషన్ ప్రక్రియ ఒక ఉద్యమం లాగా జరగాలని అన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు ద్వారా వ్యాక్సిన్ ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు మొదటి డోసు 2,95,907 మందికి అలాగే రెండో డోసు 1,00,655 మందికి వ్యాక్సిన్ ఇవ్వనైనదని అన్నారు. గురువారం నుండి చేపట్టే వ్యాక్సిన్ నేషన్ కార్యక్రమాన్ని పి.హెచ్.సి. పరిధిలోని 166 సబ్ సెంటర్ల లో అలాగే ఐదు మున్సిపాలిటీ పరిదిలో 141 వార్డులలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి తీసుకొని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు. జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం అలాగే ప్రత్యేక అధికారులను నియమించడం ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను భాగస్వాములు చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లా అధికారులకు అలాగే మండల స్థాయి అధికారులకు గ్రామాలలో ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా మైక్రో ప్లాన్ ప్రకారం వ్యాక్సిన్ నేషన్ కార్యక్రమాన్ని నూరు శాతం విజయవంతం చేసే విధంగా అన్ని చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్న సందర్భంగా జిల్లాలలో అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ లు విజయ సూచికగా కేక్ కడ్ చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, ఇంచార్జీ సి.పి. ఓ రాజేంద్ర కుమార్, డి.పి. ఓ యాదయ్య, DMHO Dr. కోటా చలం, DIO dr. వెంకట రమణ, మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post