తేదీ.15.9.21. సూర్యాపేట. మొక్కల సంరక్షణ పై దృష్టి పెట్టండి. చేసిన పనులకు చెల్లింపులు సత్వరమే చెయ్యాలి. పనుల జాప్యం పై నిర్లక్ష్యం తగదు. అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్.

జిల్లాలోని గ్రామ పంచాయతీ ల పరిదిలో చేపట్టిన పలు పనులకు సత్వరమే చెల్లింపులు చేయాలని అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుదవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల స్థాయి అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో పల్లే ప్రగతి ద్వారా చేపట్టిన వివిధ రకాల పనుల పై సమీక్షించి పెండింగ్ లో ఉన్న చెల్లింపులను సత్వరమే చేయాలని అన్నారు. గ్రీన్ బడ్జెట్ ద్వారా 10 శాతం నిధులు ఉపయోగించుకోవాలని అలాగే నాటిన మొక్కలను సంరక్షించడం చేయాలని అన్నారు. పల్లెలలో ఉపాధి పనులు ఎక్కువగా కల్పించాలని అలాగే మెగా పల్లే ప్రకృతి వనాలు ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామపంచాయతీ లలో వాచర్, మెటీరియల్ కంపోనెట్ , విద్యుత్ ఛార్జీలు, ట్రాక్టర్ల రి పే మెంట్ లు పెండింగ్ లో ఉంచొద్దని లేనియెడల చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మండలాల వారీగా చేపట్టిన పనులపై సమీక్షించారు.
ఈ సమావేశంలో డి.పి. ఓ యాదయ్య, పి.డి. కిరణ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post