తేదీ.19.9.21. సూర్యాపేట దేశ ప్రజలను ఐక్యం చేయడం లో గణేష్ ఉత్సవాలది ప్రధాన పాత్ర. ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాల నిర్వహణకు కృషి చేసిన సూర్యాపేట గణేష్ ఉత్సవ సమితి కి శుభాకాంక్షలు. వచ్చే వినాయక చవితి నాటికి మరింత సుందరంగా సూర్యాపేట. స్వయంగా భజన మందిరం గణేష్ శోభాయాత్ర ట్రాక్టర్ నడుపుకుంటూ నిమజ్జన చేసిన మంత్రి.

దేశ ప్రజలను ఐక్యం చేసి సంప్రదాయత ను పెంపొందించడం లో గణేష్ చవితి ఉత్సవాలది ప్రధాన పాత్ర అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గణేష్ శోభాయాత్ర సందర్భంగా సూర్యాపేట లో నిమజ్జన వేడుకల్లో మంత్రి సందడి చేశారు.. పోస్ట్ ఆఫీస్ సమీపంలో ని భజన మందిరం వినాయక నిమజ్జన వేడుకలలో పాల్గొన్న మంత్రి స్వయంగా గణేష్ శోభా యాత్ర ట్రాక్టర్ ను పట్టణ వీదుల్లో నడుపుకుంటూ వెళ్లి సద్దుల చెరువు బతుకమ్మ ఘాట్ లో ఉత్సవ కమిటీ సభ్యులతో కలసి నిమజ్జనం చేశారు. అంతకు ముందు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బిన్నత్వం లో ఏకత్వం సాధించిన దేశం గా ప్రపంచంలో భారత దేశానికి గుర్తింపు లభించిందని మంత్రి అన్నారు. ప్రజలను ఐక్యం చేయడం లో ఆయా మతాలకు సంబందించిన పండుగలదే ప్రధాన పాత్ర అని మంత్రి అన్నారు.దేశం లో ఎంత మంది దండయాత్ర చేసినా సాంస్కృతిక పునాదులు కడలిపోకుండా ఉన్నాయంటే మనం పాటిస్తున్న ఆచార , సాంస్కృతిక వారసత్వమే కారణం అన్నారు.ఈ ఏడాది ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలను జరుపుకో వడం లో సహకరించిన జిల్లా గణేష్ ఉత్సవ సమితి ,అధికారులకు,పోలీసులకు , ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు,ధన్యవాదాలు తెలిపారు.. వచ్చే వినాయక చవితి నాటికి ప్రజల సహకారం తో రహదారుల విస్తరణ , ఇతర అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి సూర్యాపేట ను మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి పేర్కొన్నారు.. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, అర్.డి. ఓ రాజేంద్ర కుమార్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ అన్నపూర్ణ శ్రీనివాస్, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పల లలిత ఆనంద్, వైస్ ఛైర్మన్ పుట్టా కిషోర్, కమిషనర్ రామానుజుల రెడ్డి, ఎంపీపీ నెమ్మా ది బిక్షం, జడ్పిటిసి జీడీ బిక్షం, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు , భజన మందిరం సభ్యులు,పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post