వ్యర్ధాలు ఎప్పటికీ వృధా కాబోవు అని వాటినుండి అద్భుతాలు సృష్టించొచ్చు అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. వృధా అనుకున్న వస్తువుల గురించి ఒక్కసారి లోతుగా అధ్యయనం చేయగలిగితే అదే మరో వస్తువుకు ముడి సరుకుగా మారుతుందని ఆయన తెలిపారు. సూర్యాపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల నుండి తయారు చేసిన ఆక్యుపేజర్ బోర్డ్స్,ఇటుకలు,టైల్స్ ను మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. వ్యర్థం అనుకున్న దాంట్లో నుండి అద్భుతాలు సృష్టించిన సూర్యాపేట పురపాలక సంఘాన్ని ఆయన అభినందించారు. ఇప్పటికే వాడి పారేసిన ప్లాస్టిక్ కవర్లను రీ-సైక్లింగ్ చేస్తున్న సూర్యాపేట మున్సిపాలిటీ ఆ ముద్దలను హెచ్ డి పి యి పైప్ ల తయారీకి అమ్మి ఆదాయం సమకూర్చుకోవడం అభినందనీయమన్నారు.ఇప్పుడు తాజాగా మరో అద్భుతాన్ని సృష్టించిన సూర్యాపేట పురపాలక సంఘం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లతో ఆక్యుపేజర్ బోర్డ్స్,ఇటుకలు,టైల్స్ తయారు చేయడం స్వాగతిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, కమిషనర్ రామంజుల్ రెడ్డి,స్వచ్ఛ సర్వేక్షన్ అంబాసిడర్ పెద్ది రెడ్డి గణేష్, కౌన్సిలర్ లు చింతల పాటి భరత్ మహాజన్ ,ఎస్.కె.తాయెర్,బండారు రాజా,మున్సిపల్ డి.ఇ సత్యరావు,సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్,బండి జనార్దన్ రెడ్డి,రాజిరెడ్డి,ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ శివ ప్రసాద్,ఎస్.ఎస్.ఆర్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
You Are Here:
Home
→ తేదీ.2.5.2022. సూర్యాపేట. వ్యర్ధాలనుండిఅద్భుతాలుసృష్టించొచ్చు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తో ఆక్యుపేజర్, ఇటుకలు, టైల్స్. సూర్యాపేట పురపాలక సంఘం సృష్టి. ఆవిష్కరించిఅభినందించిన మంత్రి జగదీష్ రెడ్డి.
You might also like:
-
తేదీ.17.5.2022. సూర్యాపేట. ఐఎస్ఐ మార్కు ఉన్న వస్తువులనే వినియోగించండి. జిల్లాలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి. అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు.
-
పత్రిక ప్రకటన. తేదీ.16.5.2022. సూర్యాపేట. పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి. కేంద్రాలలో అన్ని మౌళిక సదుపాయాలు కల్పించాలి. మే 23 నుండి జూన్ 1 వరకు పరీక్షల నిర్వహణ. రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా.
-
తేదీ.16.5.2022. సూర్యాపేట. నకిలీ విత్తనాలపై నిఘా పెంచాలి. వ్యవసాయ సంబంధిత షాపులలో తనిఖీలు చేపట్టాలి. వచ్చే హరితహారానికి మొక్కలు సిద్ధంగా ఉంచాలి. ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించాలి. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.
-
తేదీ.16.5.2022. సూర్యాపేట. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి. జిల్లాలో ఆయిల్ ఫామ్ పంటలు ఎక్కువగా పెంచాలి. రైతు వేదికల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.