తేదీ.2.6.2022. సూర్యాపేట. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగాల కు సిద్దం అవుతున్న నిరుద్యోగులు ఉచిత శిక్షణను వినిగించుకోవాలి. చదువు ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఉచిత శిక్షణ ఏర్పాట్లు చేసిన జిల్లా పోలీసులు, జిల్లా యంత్రాంగానికి అభినందనలు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.

ప్రభుత్వ అవకాశాలను యువత పూర్తిస్తాయిలో సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం పోలీసు ఉద్యోగ ప్రకటన చేయడంతో SI, PC ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీసు అధ్వర్యంలో ముందస్తు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. అభ్యర్థులకు సూర్యాపేట రూరల్ పరిధి కాసరభాద డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రాంగణంలో వసతి ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు.  ఈ శిక్షణలో ఉన్న అభ్యర్థులకు ఈరోజు విద్యుత్ శాఖ మంత్రి గారు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసినారు.
మంత్రి  మాట్లాడుతూ..
విజయాన్ని సాధించాలంటే ముందుగా సమస్యలను అధిగమించాలి, మనం ఎంచుకున్న లక్ష్యానికి సరైన మార్గాన్ని ఎంచుకోవాలి, చిత్తశుద్దితో సాధన చేయాలి అని పట్టుదలతో ఉంటే విజయం సాధించవచ్చు అని మంత్రిగారు అన్నారు. ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను, అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలని అన్నారు. గౌరవ ముఖ్య మంత్రి గారు రాష్ట్రంలో భారీగా 80 వేల ఉద్యోగాలను ఇవ్వడానికి సిద్దమైనారు. రాష్ట్రంలో 18 వేలకు పైగా పోలీసు ఉద్యోగాలను భర్తీ ప్రకటన ఇచ్చినారు. ఈ ఉచిత శిక్షణ ద్వారా పోలీసు శాఖలో ఉద్యోగాలు పొందాలి అన్నారు.

*ఉచిత శిక్షణ వివరాలు*

చదువు అనేది ఉద్యోగంకోసం అని బావన వీడాలి, చదువు నేర్పిన తెలివితో ముందుకు సాగాలి, వ్యవసాయం, ఇతర మార్గాల్లో కూడా ముందుకు సాగాలి, తల్లిదండ్రులకు సహాయ పడాలి అని మంత్రిగారు అన్నారు.
చదువు అనేది ఉద్యోగం అనుకోవద్దు, జీవనోపాధికి మార్గం అనే భావనతో ముందుకు సాగాలి, చదువు అనే వెలుగుతో అద్భుతాలు చేయొచ్చు అని మంత్రి గారు అన్నారు.

ఎస్పీ గారు శిక్షణ కు సంభందించి వివరాలు తెలిపినారు.
*పోలీస్ శాఖ*
– శిక్షణ కోసం మొదటగా జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ యువతీ యువకుల నుండి పోలీసు శాఖ దరఖాస్తులు స్వీకరించడం జరిగినది.

– 650 మంది అభ్యర్థులు శిక్షణ కోసం ధరఖాస్తు చేసుకోగా వారికి జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్ నందు దేవదారుడ్య పరీక్షలు, పరుగు పందెం నిర్వహించారు. ఇందులో 512 మంది అర్హత పొందినారు.

– దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన వారికి ఎంపిక రాత పరీక్ష నిర్వహించడం జరిగినది. ఎంపిక పరీక్షలో మార్కుల ఆధారంగా రిజర్వేషన్ ల ప్రకారం 200 మంది అభ్యర్థులను ఉచిత శిక్షణకు ఎంపిక చేయడం జరిగినది, ఇందులో 78 మంది మహిళా అభ్యర్థులు శిక్షణ పొందుతున్నారు.

– మే నెల 13 వ తేది నుండి కేసారం వద్ద గల డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రాంగణంలో ఇండోర్ తరగతులు, SV డిగ్రీ కళాశాల మైదానం నందు శారీరక దేహదారుఢ్య శిక్షణ ఇస్తున్నారు.

– శిక్షణ లో అభ్యర్థులకు భోజనం, వసతి కల్పించడం జరిగినది. ఉచితంగా స్టడీ మెటీరియల్ అందించడం జరిగినది.
– ఆర్మీ రికరూట్మెంట్ అభ్యర్థులకు
డబుల్ బెడ్ రూం ప్రాంగణంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ఉచిత శిక్షణలో ఉన్న 78 మంది అభ్యర్థులకు కూడా SI, PC ఉద్యోగాల కోసం ఇండోర్ తరగతులు నిర్వహిస్తున్నారు.
*SC డెవలప్మెంట్*
– SC డెవలప్మెంట్ వారు ఉమ్మడి జిల్లా నుండి ఎంపిక చేసిన 135 మంది అభ్యర్థులకు పోలీసు శాఖ అధ్వర్యంలో ఏప్రిల్ 24 నుండి SV కళాశాల వద్ద ఇండోర్, అవుట్ డోర్ శిక్షణ ఇస్తున్నారు.

*పోస్టుల వివరాలు*
– సూర్యాపేట జిల్లాలో సివిల్ కానిస్టేబుల్ – 230, ఆర్ముడ్ PC -90, ఫైర్ కానిస్టేబుల్ – 15 మొత్తం 335 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి.
– జోన్ -5 (నల్గొండ, సూర్యాపేట, రాచకొండ) లో సివిల్ SI లు-65, RSI లు- 15, ఫైర్ SI – 3 మొత్తం 83 SI పోస్టులు ఉన్నాయి. 33 % మహిళా రిజర్వేషన్, 95% స్థానికులకు ఉద్యోగ అవకాశం ప్రభుత్వం కల్పించినది.
*పరీక్ష విధానం*
– మొత్తం మూడు దశల్లో ఎంపిక ఉంటుంది.
– ఫిలిమ్స్ లో 200 మార్కుల పేపర్ నందు 60 మార్కుల తో మొదటగా ఉత్తీర్ణత సాధించాలి, ఫిలిమ్స్ నందు నెగిటివ్ మార్కింగ్ కలదు, ప్రతి 5 తప్పుడు సమాధానాలు 1 మార్క్ తీసివెస్తారు.
– ఫిలిమ్స్ నందు అర్హత పొందిన వారికి దేహదారుఢ్య పరీక్షలు అనగా పురుషులకు 1600 మీటర్ల పరుగు, మహిళలకు 800 మీటర్ల పరుగు, ఎత్తు, షాట్ పుట్, లాంగ్ జంప్ ఉంటుంది.
– PC కి ఫైనల్స్ నందు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది..
– SI ఉద్యోగానికి ఫిలిమ్స్ తర్వాత, దేవదారుడ్య పరీక్షలు ఉంటాయి అనంతరం మెయిన్స్ నందు 100 మార్కులకు తెలుగు, 100 మార్కులకు ఇంగ్లీష్, GS 200 మార్కులు, అర్తమేటిక్, రీజనింగ్ – 200 మూడు పేపర్స్ ఉంటాయి.
*ఉచిత శిక్షణ విధానం*
– ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు శారీరక దేహదారుఢ్య శిక్షణ.
– 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తరగతులు.
– 8 గంటల నుండి 10 గంటల వరకు స్టడీ అవర్.
– ప్రతిరోజూ, వీక్లీ టెస్ట్ లు నిర్వహిస్తాం.

• శిక్షణలో నిష్ణాతులైన ఇండోర్, అవుట్ డోర్ సిబ్బందితో అభ్యర్థులకు తరగతులు నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అందించిన నిధులతో శిక్షణను అందిస్తున్నాము.

కార్యక్రమంలో జిల్లా కలక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి IAS గారు, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ IPS గారు, RDO, DSP లు, CI లు, ZPTC, MPTC, సంక్షేమ అధికారులు, ప్రజా ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు

Share This Post