తేదీ.2.6.2022. సూర్యాపేట. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు కృషి. సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు అందాలి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గణనీయమైన వరిసాగు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.

జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన వేడుకల్లో ముఖ్యఅతిధిగా పాల్గొని ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరణ అనంతరం అమరవీరుల స్థూపం వద్ద పులగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించి జిల్లా అభివృద్ధి పై ప్రసంగించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తున్నామని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుందని అన్నారు. చిదిమిపోయిన వ్యవసాయ రంగానికి ఒక కొత్త వరవడి తెచ్చి తెలంగాణలో ఉన్న ప్రతి రైతును కపాడుకుంటున్నామని అన్నారు. ముమ్మాటికీ రైతే రాజని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకం ద్వారా వ్యవసాయ పెట్టువాడికి రెండు పంటలకు పది వేల చొప్పున 2021 వానాకాలం లో 2,52, 960 మంది రైతులకు 308 కోట్ల రూపాయలు అలాగే యసంగిలో 309 కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేయడం జరిగిందని అన్నారు. 2018 వానాకాలం నుండి ఇప్పటి వరకు 2 వేల 108 కోట్ల రూపాటల నగదును రైతు ఖాతాలలో జమచేయడం జరిగిందని తెలిపారు. రుణమాఫీ కింద ఇప్పటివరకు 20,672 రైతులకు రూ.55 కోట్ల 15 లక్షల రుణ మాఫీ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే జీవిత భీమా పథకం ద్వారా చనిపోయిన 496 మంది రైతుల కుటుంబ సభ్యులకు ఇప్పటివరకు రూ. 25 కోట్ల భీమా అందించామని అన్నారు. అలాగే రైతు భీమా పథకం ప్రారంభం నుండి ఇప్పటివరకు 2711 మంది చనిపోయిన రైతు కుటుంబాలకు 136 కోట్ల రూపాయల భీమా మొత్తం చెల్లించడం జరిగిందని అన్నారు.జిల్లాలో సమగ్ర వ్యవసాయ విధానం లో భాగంగా 82 రైతు వేదికలను పూర్తి చేసి రైతులకు పంట సాగు విధానం పై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ద్వారా రైతుకేంద్రాలు ఏర్పాటు చేసి 2021 వానాకాలం, యాసంగి లో రైతుల నుండి 5 లక్షల 34 మెట్రిక్ టన్నుల ధాన్యంను 98781 మంది రైతుల నుండి కొనుగోలు చేసి రూ.1045 కోట్లు రైతు ఖాతాలలో జమచేయడం జరిగిందని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్, సాగునీరు సమృద్ధిగా అందటంతో వ్యవసాయ అభిరుద్ది గణనీయంగా పెరిగిందని అన్నారు. జిల్లాలో నూరు శాతం సబ్సిడీ చేప పిల్లలను అందించుట జరుగుతుందని అలాగే 2021-22 సంవత్సరంలో 25 లక్షల 45 వేల మంచినీటి రొయ్య పిల్లలను పంపిణీ చేయడం జరిగిందని రూ. 70 లక్షల 40 వేల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. పశు సంవర్ధఖ శాఖ ద్వారా యాదవులకు 17 685 యూనిట్లకు గాను . రూ 214 కోట్ల ఖర్చుతో 362000 గొర్రెలు పంపిణీ చేయడం జరిగింది. రెండవ విసత లో 17600 మంది లబ్దిదారులకు 318 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మిషన్ కాకతీయ ద్వారా 905 చెరువులు 343 కోట్ల అంచనా వ్యయం తో మంజూరు కాగా పనులు 90 శాతం పూర్తి చేశామని జిల్లాలో 43 చెక్ డ్యాం నిర్మాణానికి రూ.265 కోట్లు మంజూరు చేయగఇప్పటి వరకు రూ.117 కోట్ల పనులు జరిగాయని అన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా జిల్లాలో రక్షిత మంచినీటి సరఫరా చేయుటకు 855 కోట్లతో పథకం మంజూరు చేశామని అన్నారు. శ్రీరామ్ ప్రాజెక్టు కింద 2 లక్షల 13 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవడుతుందని అన్నారు. అలాగే nsp కింద 2 లక్షల 30 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నామని వివరించారు. అలాగే DRDA శాఖ ద్వారా పేద, నిరుపేద కుటుంబాలకు ఒక లక్ష 82 వేల 8 వందల మంది మహిళలలతో 17383 SHG లను ఏర్పాటు చేయడం జరిగిందని అందులో భాగంగా వారి ఆర్ధిక బలోపేతానికి చేయుట కల్పిస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల తీరు వెలకట్టలేనిదని జిల్లాలు , ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన పేషంట్లకు మెరుగైన వైద్యం అందించని అన్నారు. ప్రభుత్వం మైనార్టీ, గిరిజన, బి.సి సంక్షేమానికి అధిక నిధులు కేటాయిస్తూ మెరుగైన సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా కొత్త కలెక్టరేట్, మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేసుకోవడం జరుగుతుందని ఈ సందర్బంగా మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్ పర్సన్ గుజ్జా దీపికా యుగంధర్, జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, ఆదనపు కలెక్టర్లు యస్. మోహన్ రావు, పాటిల్ హేమంత్ కేశవ్, గ్రంధాలయా చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పి. అన్నపూర్ణ, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post