జిల్లాలో వివిధ సమస్యలపై ప్రజలు ప్రజావాణిలో అందచేసిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నలు మూలల నుండి వివిధ సమస్యలపై వచ్చి ప్రజావాణిలో అందచేసిన దరఖాస్తులను స్వీకరించి సంబంధిత అధికారులకు అందజేయడం జరిగిందని అన్నారు. వివిధ రకాల భూ సమస్యలపై ఎక్కువగా దరఖాస్తులు అందాయని అన్నారు. ప్రజావాణిలో భూ సమస్యల దరఖాస్తులు 46, సదరం క్యాంప్ 4,ఆసరా పించన్ 1,వ్యవసాయ ట్రాక్టర్ 1, ఆర్.టి. ఐ 3, పురపాలక 1, రుణ మాఫీ 1, వైద్య 4, ఉద్యోగాలు 3, రేషన్ కార్డు 1, మొత్తం 65 దరఖాస్తులు
అందాయని అట్టి దరఖాస్తులను వారి యొక్క అర్హత మేరకు పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని సూచించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి. ఏ. ఓ రామారావు నాయక్, డి.పి. ఓ యాదయ్య, సి.పి. ఓ వెంకటేశ్వర్లు, ఏ. ఓ శ్రీదేవి, పర్యవేక్షకులు సుదర్శన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, దరఖాస్తుదారులు తదితరులు పాల్గొన్నారు.