తేదీ.20.9.21. సూర్యాపేట. పోషణ లోపం లేకుండా చూడాలి. పెరటి తోటల పెంపకం పై దృష్టి సారించండి. అంగన్వాడీ కేంద్రాలు పరిశీలన. అంగన్వాడీ కేంద్రాల పనితీరు బేష్. నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ఏడి జాన్సన్

దేశ వ్యాప్తంగా పోషణ లోపం లేకుండా “ఆరోగ్య భారత్- ఆరోగ్య తెలంగాణ ” అనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పోషన్ అభియాన్ పధకం జిల్లాలో అమలు అవుతున్న తీరుపై సోమవారం పలు ప్రాంతాల్లో రాష్ట్ర స్థాయి నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ప్రతినిధి బృందం పర్యటించింది. అంగన్వాడీ కేంద్రాల పనితీరును పరిశీలించి లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించడానికి పలు సూచనలు జారీ చేస్తూ,పెరుగుదల పర్యవేక్షణ కోసం అనుసరిస్తున్న  విధానాల యొక్క నాణ్యతను పరిశీలించి పోషణ లోపం లేకుండా ఉండాలంటే పెరుగుదల పర్యవేక్షణ పై ప్రత్యేక దృష్టి సారించి వారి ఆరోగ్య స్థితి  పై పౌష్టికాహారం పై అవగహన కల్పించాలని సూచించారు.

ఈ సందర్భంగా నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అసిస్టెంట్ డైరెక్టర్ జాన్సన్ మాట్లాడుతూ ప్రస్తుతం 4వ రాష్ట్రీయ పోషన్ మహ్ లో భాగంగా అన్ని అంగన్వాడీ కేంద్రాలలో పోషణ మాసోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పెరుగుదల పర్యవేక్షణ, పెరటి తోట పెంపకం, యోగ మేలుకవలు ,రక్తహీనత లోపం ఈ నాలుగు అంశాల పై ప్రత్యేక దృష్టి సారించి జనచైతన్యం తీసుకవచ్చి ” ఆరోగ్య భారత్ -ఆరోగ్య తెలంగాణ కోసం ” కృషి చేస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో ఆధునిక పరికరాల ద్వారా పెరుగుదల పర్యవేక్షణ చేస్తూ పోషణ లోపం తీవ్ర పోషణ లోపం తో బాధ పడేవారిని గుర్తించి అదనపు పోషక ఆహారం అందించడమే కాకుండా ఆరోగ్య శాఖ వారి సమన్వయంతో ఎన్ఆర్సీ కీ సిఫార్సు చేసి వారి ఆరోగ్యం పై ప్రత్యకే దృష్టి పెడుతున్నామన్నారు. పెరటి తోటలు పెంపకంలో భాగంగా జిల్లాలో  అన్ని అంగన్వాడీ కేంద్రాలకు విత్తనాలు పంపిణీ చేయడం జరిగిందని సేంద్రియ పద్ధతిలో ఈ పెరటి తోటలు సాగు చేసి లబ్ధిపొందేవారికి నాణ్యమైన పౌష్టికాహారం అందజేయడమే లక్ష్యమన్నారు. యోగ చేయడం తద్వారా కలిగే లాభాల పై విస్తృతంగా ప్రచారం నిర్వహించి అవగహన కల్పిస్తామని,ప్రతి యొక్కరు టీ-సాట్ వినియోగించుకొని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ పై అవగహన పెంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హార్టికల్ట్ ర్ ఏడి జైరామ్, నేషనల్ న్యూట్రిషన్ మిషన్ రాష్ట్ర ప్రతినిధి రాహుల్ సాధు, సీడీపీవో కిరణ్మయి, పోషన్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ పి. సంపత్,అంగన్వాడీ సూపర్ వైజర్లు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post