తేదీ.20.9.21. సూర్యాపేట. స్పెషల్ డ్రైవ్ లో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలి. వైద్యాధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలి. డోర్ టు డోర్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి. అందుబాటులో వ్యాక్సిన్. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి

జిల్లాలో ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్ వాక్సి నేషన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ ను తీసుకోవాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కుటుంబం, అరోగ్య సమజాం కోసం కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ తప్పనిసరని జిల్లాలోని అర్బన్ 141కేంద్రాలు, రూరల్ లోని 153 అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు,పి.హెచ్.సిల పరిదిలో 31 కేంద్రాలలో 19 వ తేదీ నాటికి మొదట డోస్ వ్యాక్సిన్ 59051మందికి, రెండోవ డోస్ 14891 మందికి మొత్తం 73942 మందికి వ్యాక్సిన్ అందించామని తెలిపారు. గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులను ఈ కార్యక్రమంలో ఎక్కువగా భాగస్వాములు చేయాలని డోర్ టు డోర్ సర్వే ను ప్రజలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసు కునెలా అలాగే కమిటీ సభ్యులు, ప్రత్యేక అదికారులు సమన్వయంతో కలసి పనిచేయాలని తెలుపుతూ జిల్లా వైద్యాధికారులు నిరంతరం పర్యవేక్షణ జరపాలని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.

Share This Post