తేదీ.22.1.2022. సూర్యాపేట. దివ్వాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అండ. వికలాంగులు మనో ధైర్యం తో ముందుకెళ్లాలి. రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి.

దివ్యాoగుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట నందు ఐసీడీయస్ శాఖ ఆధ్వర్యంలో దివ్యాoగులకు ఉచిత సహాయ ఉపకరణాలు పంపిణీ కార్యక్రమంలో యం. పి. బడుగుల లింగయ్య యాదవ్, రాష్ట్ర దివ్యoగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డిలతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తెచుకున్నాక దివ్యఅంగులకు అన్ని రంగాలలో రాణించాలని అలాగే ఆర్ధిక సామాజిక పరిస్థితులు మెరుగుపరచి వారిలో మనోధైర్యాన్ని నింపటానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో మహిళా, శిశు,దివ్వాంగుల మరియు వయో వృద్ధుల శాఖా ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం సందర్బంగా దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల స్క్యూటి లు,ట్రై సైకిల్లు,లాప్ టాప్ లతో పాటు 4జి ఫోన్ లను ఆయన అంద జేశారు. దివ్వాంగులకు అండగా నిలిచి వారి ఆర్ధిక భరోసా కు చేయుతను అందిస్తున్నామని అన్నారు. అంగవైకల్యం వలన మానసికత తో బదపడవద్దని దివ్యంగులు ఉన్నత విద్యలను అభ్యసించి ఎన్నో రంగాలలో ఉన్నారని ఈ సందర్బంగా గుర్తుచేశారు. రూ.69 లక్షల విలువగల 34 మూడు చక్రాల వాహనాలు, 11 ల్యాప్ ట్యాప్ లు, 10 సెల్ ఫోన్లు అందచేసారు. ఆ నాడు ఉద్యమ సమయంలోనే వికలాంగులను గుర్తించింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని , అందుకే కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వారికి 1500 రూపాయల ఫించన్ అందించారన్నారు.రెండో మారు అధికారంలోకి రాగానే వారి ఫించన్ ను 3116 లకు పెంచిన ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. దివ్యఅంగులు అడగక పోయినా వారి జీవితాల్లో వెలుగులు నింపే పద్దతిలో వారికి ఆసరాగా ఉండాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అన్నారు.అంగ వైకాల్యతను అధిగమించి మిగితా వారితో పోటీగా అన్ని రంగాలలో వారిని పోటీ పడేలా మానసికంగా సిద్ధపరచడమే తమ ముందున్న కర్తవ్యమన్నారు. కళ్యాణాలక్ష్మి/షాది ముబారక్ ,రైతుభీమా,రైతుబంధు వంటి పథకాలు దేశంలోని రైతు బంధు పేరుతో 14 నుండి 15 వేల కోట్ల రూపాయలు రైతాంగానికి పెట్టుబడుల రూపంలో అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ కదా అన్నారు. అదే ముఖ్యమంత్రి కేసీఆర్ సాలీనా 3000 కోట్ల ప్రీమియం తో యావత్ భారతదేశంలోనే మొట్ట మొదటి సారిగా సహజ మరణాలకు కుడా భీమా వర్తించేలా రైతుభీమా పెట్టింది నిజం కాదా అని ఆయన అన్నారు. జిల్లాలో 18735 మంది వికలాంగులు ప్రతి నెల పెంచన్లు పొందుతున్నారని ఈ సందర్బంగా స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కోదాడ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ పి. అన్నపూర్ణ, జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జెడ్.పి. వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్, పి.డి. ఐసీడీయస్ జ్యోతి పద్మ, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

దివ్వాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అండ.
వికలాంగులు మనో ధైర్యం తో ముందుకెళ్లాలి.
రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి.

Share This Post