తేదీ.22.4.2022. సూర్యాపేట. మైనార్టీ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత. ప్రభుత్వం ఇఫ్తార్ విందులు తెలంగాణ లోనే. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి.

మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
సూర్యాపేట లోని పి.ఎస్. ఆర్ సెంటర్ లో పవిత్ర రంజాన్ సందర్భంగా పేద ముస్లీం లకు దుస్తులు పంపిణీ చేసి చిన మజీద్ లో ఇఫ్తార్ విందు లో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ
నమ్మింది అచరించడం తో పాటు ఇతరుల తో ఆచరింపచేయడం సి.యం. కేసీఆర్ కే చెల్లిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.రంజాన్ మాసం సందర్భంగా సూర్యాపేట లోని పి.ఎస్.ఆర్ సెంటర్ లో పేద ముస్లీం సోదర సోదరి మణులకు ప్రభుత్వం తరుపున మంత్రి దుస్తులను పంపిణీ చేశారు.. అనంతరం చిన మసీద్ లో ముస్లీం సోదరులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు లో మంత్రి పాల్గొన్నారు. గత పాలకులు ముస్లీం లను కేవలం ఓటు బ్యాంకు మాత్రమే చూస్తే,.ముస్లిం సమాజానికి ప్రభుత్వం అండగా ఉందన్నారు.వారి ఉన్నతికి అనేక సంక్షేమ పధకాలను తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే చెల్లిందన్నారు.సమాజం లోని అన్ని వర్గాల ప్రజలు బాగుంటే నే అది మంచి సమాజం అవుతదని నమ్మిన నేత కేసీఆర్ అన్నారు.ప్రభుత్వం తరుపున ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసింది కేవలం తెలంగాణ లో నే అని దేశంలో ఎక్కడా లేదన్నారు. పవిత్రమైన రంజాన్‌ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులకు దుస్తులు పంపిణీ చేయడం సంతోషించతగ్గ విషయమని. మైనార్టీలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత ప్రభుత్వానిదేనన్నారు. ఇఫ్తార్ విందు లో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి పేద ముస్లీం యువకుడి పట్ల ఔదార్యం చాటారు. పుట్టుక తో వికలాంగుడైన చెఫ్ గా రాణించి ఉపాధి పొందుతున్న 21 వార్డ్ కు చెందిన షేక్ ఇబ్రహీం ను మరింత గా ప్రోత్సాహం అందివ్వడానికి లక్షా 40 వేల రూపాయల సొంత నిధులతో త్రీ వీలర్ ను అందజేసి మరోసారి తన ఔదార్యాన్ని చాటారు. రెండు రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్ కు చెందిన అహ్మద్ కు నేడు ఇబ్రహీం లకు ఆపన్న హస్తం అందించిన మంత్రి జగదీష్ రెడ్డి కి ముస్లిం మత పెద్దలు,నేతలు ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో ఆర్.డి.ఓ రాజేంద్రకుమార్, తహసీల్దార్ వెంకన్న, మైనార్టీ సంక్షేమ అధికారి శంకర్, మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ, జడ్పి వైస్ చైర్మన్ గోపాగాని వెంకట్ నారాయణ గౌడ్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, పట్టణ అధ్యక్షుడు సవరాల స్థానారాయణ, కార్యదర్శి బూర బాల సైదులు , ఉప్పల ఆనంద్ , అబ్దుల్ రహీమ్ (పిల్లు ), రియాజ్, మత గురువు అక్తర్ మౌలానా, హాఫెజ్ ఖాలీల్,గయాజ్ అహ్మద్,కౌన్సిలర్లు జహీర్, కరాటే సయ్యద్ ,అప్సెర్ భాయ్, పెద్ద గట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్,
లింగంపల్లి శ్రీనువాస్ , కీసర వేణు, ముది రెడ్డి అనీల్, తదితరులు పాల్గొన్నారు..

Share This Post