తేదీ.23.4.2022. సూర్యాపేట. అసంక్రమిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.

 

 

జిల్లాలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని
రాష్ట్ర అసంక్రమిత వ్యాధుల అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ పుష్ప అన్నారు. శనివారం రాష్ట్ర ప్రోగ్రాం అధికారి డాక్టర్ అనూష తో కలసి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గిరి నగర్ , రాజీవ్ నగర్ లను సందర్శించి రికార్డులు , రిపోర్టుల ను పరిశీలించారు. కేంద్రలలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలతో మాట్లాడి స్క్రీనింగ్ వివరాలను తెలుసుకున్నారు. అసంక్రమిత వ్యాధులపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమం నిర్వహించాలని, ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని సూచించారు. అనంతరం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లోని పాలియేటివ్ కేర్ విభాగాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న రోగుల తో మాట్లాడి సౌకర్యాలను ఆరా తీశారు. ఉపశమన చికిత్సలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. అనంతరం ఆస్పత్రిలోని అసంక్రమిత వ్యాధుల క్లినిక్ ను సందర్శించారు. క్లినిక్ లో అందుతున్న సేవలను తెలుసుకున్నారు. బీపీ షుగర్ పేషెంట్ ల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని, క్యాన్సర్ అనుమానితుల కు ఉచిత పరీక్షలు నిర్వహించాలని , ప్రజలలో మరింత అవగాహన పెంచాలని కోరారు. టెలీ మెడిసిన్ విభాగంలో అందుతున్న సేవలను అక్కడున్న వారి వద్ద నుంచి తెలుసుకున్నారు. గ్రామీణ స్థాయిలో ఎంతో ఉపయోగపడుతున్న టెలీ మెడిసిన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోట చలం మాట్లాడుతూ జీవనశైలి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని, వ్యాధిగ్రస్తులు ప్రతినెల క్రమం తప్పక మందులు వాడాలని, బీపీ షుగర్ పరీక్షలు ప్రతినెల చేయించుకోవాలని, గ్రామంలోని ఆరోగ్య కార్యకర్తల వద్ద, ఆశ కార్యకర్తల వద్ద క్యాన్సర్ సంబంధిత ఉచిత పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి , కోఆర్డినేటర్ భూతరాజు సైదులు,పాలియేటివ్ కేర్ విభాగం వైద్యులు డాక్టర్ సతీష్, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్వేత , మానసిక వైద్య నిపుణులు డాక్టర్ శ్రవంతి, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ లోహిత , జానకమ్మ, సమద్, కవిత, రవి, నాగు, ఏక స్వామి ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Share This Post