తేదీ :24-08 -2021 సూర్యాపేట. పాఠశాలల పునః ప్రారంభానికి సర్వం సిద్ధం గా ఉంచండి. ఆగష్టు 30 లోగా పాఠశాలలో పారిశుద్ద్య పనులు పూర్తి చేయాలి. సెప్టెంబర్ 01 నుండి పాఠశాలలు ప్రారంభం. రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, యర్రబెల్లి దయాకర్ రావు. సెప్టెంబర్ 01 నుండి అన్ని పాఠశాలలు ప్రారంభించ నున్నందున స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అన్ని పాఠశాలలో పారిశుద్ద్య పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, యర్ర బెళ్లి దయాకర్ రావు అన్నారు.

మంగళవారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, మున్సిపల్ నగర పాలక సంస్థ చైర్మన్లు, జిల్లా విధ్యాధికారులు, జిల్లా పంచాయితీ అధికారులతో పాఠశాలల పునః ప్రారంభం, పారిశుద్ద్య పనుల నిర్వాహణ పై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కోవిడ్ కారణంగా పాఠశాలలు తిరిగి 16 నెలల తర్వాత సెప్టెంబర్ 01 నుండి ప్రారంభించుకుంటున్నామని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలల్లో పారిశుద్ద్య చర్యలు చేపట్టాలని అన్నారు. పాఠశాలల్లో ప్రతి తరగతి గది ని ఫర్నిచర్ ను శుభ్రపరచాలని అన్నారు. పాఠశాలను నీటితో కడిగించాలని, ముఖ్యంగా టాయిలెట్లను శుభ్రపరచాలని అన్నారు. పాఠశాలల్లో గల కిచన్ షెడ్డులను ప్రత్యేకంగా శుభ్రపరచాలని అన్నారు. ప్రతి పాఠశాలకు మిషన్ భగీరథ ద్వారా నళ్లా నీరు సరఫరా జరిగేలా గైకోనాలని అన్నారు. విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్క విద్యార్థి తప్పని సరిగా మాస్కులు ధరించి పాఠశాలలకు రావాలని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలో కూడా పారిశుద్ద్య చర్యలు చేపట్టేలా జిల్లా విద్యాధికారులు పర్యవేక్షించాలని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల బస్సులలో విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకొవాలని అన్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కెంద్రాల పారిశుద్ద్య చర్యల భాద్యత సంబంధిత గ్రామ పంచాయితీదేనని తెలిపారు. పాఠశాలలు, అంగన్వాడీ కెంద్రాలలో పారిశుద్ద్య పనులలో గ్రామ సర్పంచు, ఎం.పి.పి.లు, జడ్పీటిసిలు, వార్డు మెంబర్లు, ఇతర ప్రజాప్రతినిధులందరూ భాగస్వామ్యులు కావాలని అన్నారు. ఆగష్టు 30 లోగా అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కెంద్రాలు పూర్తి స్థాయిలో పారిశుద్ద్య చర్యలు నిర్వహించి ప్రారంభానికి సిద్ధంగా ఉంచినట్లు సంబంధిత ప్రధానోపాధ్యాయులు సర్టిఫికెట్ ను ఇవ్వాలని అన్నారు. పాఠశాలలు ప్రారంభం అయిన తర్వాత ప్రతి రోజు కలెక్టర్లు, జిల్లా విద్యాధికారులు, జిల్లా పంచాయితీ అధికారులు, ఎం.పి.డి.వో.లు, మండల విద్యాధికారులు, మండల పంచాయితీ అధికారులు పాఠశాలలను సందర్శిస్తూ పారిశుద్ద్య చర్యలను కొనసాగేలా చర్యలు గైకోనాలని సూచించారు. కొంత మంది విద్యార్థుల తల్లిదండ్రులు కొవిడ్ థర్డ్ వేవ్ వస్తుందనే భయందోళనలో ఉన్నారని, విద్యార్థులను ఎవరిని బలవంతంగా పాఠశాలలకు తీసుకురావద్దని అన్నారు. కోవిడ్ నిబంధనల మేరకే స్వచ్చందంగా వచ్చే విద్యార్థులకు పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. పాఠశాలలో ఏదేనీ ఒక విద్యార్థి దగ్గు, జలుబు, జ్వరము వంటి కోవిడ్ లక్షణాలతో ఉంటే వెంటనే సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కెంద్రంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన పక్షంలో విద్యార్థి ఆ తరగతి గదిలో ఉన్న ప్రైమరీ కాంటాక్ట్ విద్యార్థులను గుర్తించి అందరికి కొవిడ్ పరీక్షలు చేయించాలని అన్నారు.

రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో, అంగన్వాడీ కెంద్రాలలో పకడ్బందీ పారిశుద్ద్య చర్యలు చేపట్టి పండుగ వాతావరణంలో సెప్టెంబర్ 01 న పాఠశాలలను ప్రారంభించాలని అన్నారు. ప్రతి రోజు పాఠశాలల్లో పారిశుద్ద్య చర్యలు గ్రామ పంచాయితీ ద్వారా నిర్వహించాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించాలని, నిల్వ నీటిని లేకుండా మట్టి వేయించాలని అన్నారు. అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీలు, విద్యార్థుల కమిటీలు ఏర్పాటు చేసి పరిశుభ్రమైన పరిసరాలలో పాఠశాలల్లో విద్యా భోదన చేయుటకు చర్యలు తీసుకొవాలని సూచించారు. పూర్వ విద్యార్థుల నుండి డోనేషన్లు స్వీకరించి పాఠశాలల్లో వైట్ వాషింగ్ ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. అన్ని పాఠశాలల పారిశుద్ద్య పనుల నిర్వాహణ భాద్యత గ్రామ పంచాయితీలదేనని పంచాయితీ రాజ్ చట్టంలో ఉందని మంత్రి అన్నారు. ప్రతి పాఠశాలల్లో మిషన్ భగీరథ నళ్లా ఉండాలని సంబంధిత ఏ.ఈ.లు పాఠశాలను సందర్శించి లేనిచోట నళ్లాలు అమార్చాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాత్కాలిక మరమ్మత్తులు ఉంటే వెంటనే చేయించాలని అన్నారు. పాఠశాలల ప్రారంభాన్ని ప్రతి ఒక్కరూ చాలెంజ్ గా తీసుకొని పాఠశాలల్లో పకడ్బందీ పారిశుద్ద్య చర్యలు చేపట్టాలని అన్నారు. పారిశుద్ద్య చర్యల నిర్వాహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులు, ప్రజాప్రతినిధుల పై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి విద్యార్థి మాస్కు ధరించి పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకొవాలని జిల్లా విద్యాధికారులకు సూచించారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కెంద్రాల డాక్టర్లతో సమన్వయం చేసుకొవాలని అన్నారు. అన్ని పాఠశాలల్లో బ్లిచింగ్, లైమ్ చల్లించాలని, త్రాగు నీటి వాటర్ ట్యాంకులను క్లోరినేట్ చేయించాలని అన్నారు. అన్ని మున్సిపాలిటీలలో, నగరపాలక సంస్థల పరిధిలోని పాఠశాలలో, అంగన్వాడీ కెంద్రాలలో ఈగలు, దోమలు లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు.

మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ మాట్లాడుతూ విద్యార్థులు ఎన్నో నెలలుగా ఎదురుచుస్తున్న విధంగా ప్రభుత్వం సెప్టెంబర్ 01 నుండి పాఠశాలలు ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మున్సిపల్ పరిధిలో అన్ని పాఠశాలల్లో , అంగన్వాడీ కెంద్రాలలో అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతో పకడ్బందీగా పారిశుద్ద్య చర్యలు నిర్వహించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పాఠశాలల ప్రారంభానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. చేపట్టే పారిశుద్ద్య చర్యలల్లో బాగంగా ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యులు చేస్తామని తెలిపారు.

అనంతరం జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ kovid నేపద్యంలో ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా సెప్టెంబర్ 01 నుండి పాఠశాలల పునః ప్రారంభానికి జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలో సెప్టెంబర్ 30 నాటికి పారిశుద్ద్య, ఇతర పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచుతామని తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కెంద్రాలలో స్పెషల్ డ్రైవ్ ద్వారా పారిశుద్ద్య చర్యలు నిర్వహించుటకు జిల్లా విద్యాధికారికి, జిల్లా పంచాయితీ అధికారికి, మండల విద్యాధికారులకు, మండల పంచాయితీ అధికారులకు , ఎం.పి.డి.వో. లకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అన్ని పాఠశాలల్లో మిషన్ భగీరథ ద్వారా త్రాగు నీరు సరఫరాకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వివరించారు.

ఈ వీడియో కాన్పరెన్సులో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, పురపాలక శాఖ కమిషనర్ సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు మోహన్ రావు, పాటిల్ హేమంత్ కేశవ్, జెడ్.పి. సి. ఈ. ఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, పి.డి. కిరణ్ కుమార్, డి.పి. ఓ యాదయ్య, ఏ.డి. సాహితీ, DIO కృష్ణయ్య, మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి, సంక్షేమ అదికారులు దయానంద రాణి, ఉపేందర్, శంకర్, శిరీష, మిషన్ భగీరథ అదికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post