తేదీ.24.12.2021. సూర్యాపేట. వినియోగదారుల హక్కులు, చట్టాలపై ఆవగహన కలిగి ఉండాలి. వినియోగదారుల ఫోరమ్ సేవలు అభినందనీయం. కల్తీ వస్తువుల తనిఖీలో అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలి. అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు.

 

జిల్లాలో వినియోగదారుల ఫోరమ్ సేవలు ఆమోఘమని అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నందు జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్బంగా జిల్లా అధికారులు, ఫోరమ్ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు చేసే ప్రతి వస్తువు పై బిల్లులు తీసుకోవడం వినియోగదారుల హక్కు అని తెలుపుతూ నాణ్యతా ప్రమాణాలు లేని వస్తువుల పై సంబందించిన అధికారులు నిరంతర తనిఖీలు చేపట్టాలని ఆదిశగా వినియోగదారులకు న్యాయం జరుగుతుందని అన్నారు. ముఖ్యoగా ఫోరమ్ వినియోగదారులను చైతన్య పరిచేందుకు జిల్లా అంతటా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో ఇప్పటికే 15 ఫోరమ్ లు పని చేస్తున్నాయని అన్నారు. వస్తువుల కొనుగోలులో నష్టం కలిగితే నేరుగా ఫోరమ్ లో అప్పీలు చేసుకొని నష్ట పరిహారం పొందాలని అన్నారు. 1986 లో ఈ చట్టం రూపొందించబడిందన్ని హక్కులు, చట్టం పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగిఉండలని అన్నారు. కల్తీ, నకిలీ వస్తువుల కొనుగోలు బాద్యులకు ఫోరమ్ ద్వారా సంబంధిత వారి పై కేసులు నమోదు చేసి న్యాయం చేయడం జరిగిందని ఈ సందర్బంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డి.యస్.ఓ విజయలక్ష్మి, డి.ఎం. రాంపతి, ఫోరమ్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు , సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post