తేదీ.24.8.2021. సూర్యాపేట. పారిశుధ్య పనులకు ప్రాధాన్యత ఇవ్వండి. పిల్లలకు కరోనా పై అవగాహన కల్పించాలి. రాష్ట్ర గురుకులాల సెక్రటరీ రోనాల్డ్ రోజ్.

 

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలు పునర్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని గురుకులాల్లో పారిశుధ్య పనులు చేపట్టి ముందస్తుగా అందుబాటులో ఉంచాలని రాష్ట్ర గురుకుల సెక్రటరీ రోనాల్డ్ రాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక గురుకుల పాటశాల, కళాశాలను ఆయన జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి , అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నేపద్యంలో పిల్లల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున పిల్లల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని. అలాగే అన్ని పాఠశాలలు , కళాశాలల లో పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడు చేపట్టి ఈ నెల 30 నాటికి అందుబాటులో ఉంచాలని సూచించారు. పాఠశాలలు, కళాశాల ల పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కలను తొలగించి శానిటేషన్ చేయించాలని సూచించారు. తరగతి గదులలో పూర్తిగా వెలుతురు ఉండాలని అలాగే నీరు నిల్వ ఉండకుండా చూడాలని మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు. పిల్లల లో లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిస్త అందించాలని సూచించారు. సెప్టెంబర్ ఒకటి నుండి పాఠశాలకు పునర్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పిల్లల తల్లిదండ్రులకు సమాచారం అందించాలని అలాగే అధ్యాపకులు, సిబ్బంది అందరూ విధులకు తప్పక హాజరు కావాలని తెలిపారు. పాఠశాలలో వివిధ పనులకు అందుబాటులో ఉన్న గ్రామ, మునిసిపల్ నిధులను ఉపయోగించుకోవాలని సూచించారు. కళాశాలలో ఉన్న స్టోర్ గదిని , పరిసర ప్రాంతాలను కలెక్టర్ తో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సమావేశంలో అర్.సి. ఓ అరుణ కుమారి, జెడ్. ఈ. ఓ dr. రజని, ప్రిన్సిపల్ శైలజ, శమంతక మణి, చారీ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post