తేదీ.24.8.2921. సూర్యాపేట. జిల్లాలో అన్ని పాఠశాలలను సిద్దంగా ఉంచండి. పారిశుధ్య పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. పాఠశాలలో మాస్క్ లు అందుబాటులో ఉంచాలి. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

 

జిల్లాలో అన్ని పాఠశాలలు, వసతి గృహాలు, కళాశాలలో పారిశుధ్య పనులు చేపట్టి పూర్తి స్థాయి లో ఈ నెల 30 వరకు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డీ జిల్లా , మండల స్థాయి అధికారులను ఆదేశించారు. మంగళ వారం రోజున కలెక్టరేట్ నుండి అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావుతో కలసి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలు పునర్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా జిల్లాలో ఉన్న ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు, అలాగే కళాశాలలు ఈ నెల 30 నాటికి పారిశుధ్య పనులు చేపట్టి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలు 1278 , కళాశాలలు 72 ఉన్నాయని ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా అదికారులు ఆదిశగా పాఠశాలలు, కళాశాలలో పిల్లల ఆరోగ్య దృష్ట్యా కరోనా నేపద్యంలో అన్ని మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ముఖ్యంగా ప్రతి పాఠశాలకు మిషన్ భగీరథ త్రాగునీరు , మరుగుదొడ్లు శుభ్రత, త్రాగునీటి ట్యాంకులు శుద్ది, తరగతి గదుల పరిశుభ్రత వంటి పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అందుబాటులో ఉన్న గ్రామపంచాయతీ, మున్సిపల్ నిధులతో చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలలో టీచర్లు నూరు శాతం హాజరు కావాలని సూచించారు. ముందస్తుగా పిల్లల తల్లిదండ్రులకు పాఠశాలల పునర్ ప్రారంభోత్సవ సమాచారం అందించాలని అలాగే అన్ని పాఠశాలలో పిల్లల కొరకు మాస్క్ లు , అందుబాటులో ఉంచాలని సూచించారు. ముఖ్యంగా కిచన్ షేడ్స్ ఎప్పటికప్పుడు శుబ్రంగా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తరగతి గదులలో వెలుతురు ఉండేలా చూడాలని , పిల్లల రక్షణకు తీసుకుంటున్న చర్యలు నిరంతరం ఉండాలని సూచించారు. ఈ నెల 30 నాటికి సూచించిన అన్ని పనులు పూర్తి చేసి ధృవీకరణ పత్రం అందించాలని తెలుపుతూ పనులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు . పిల్లలో కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ప్రత్యేక చర్యలు చేపట్టాలని అలాగే దోమల వలన వచ్చే డెంగీ, మలేరియా కేసులు నమోదు కాకుండా ఫాగింగ్, యాంటీ లార్వా మందులను ఉపయోగించాలని సూచించారు.
ఈ కాన్ఫరెన్స్ లో జెడ్.పి. సి. ఈ. ఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, పి.డి. కిరణ్ కుమార్, ఏ.డి. విద్యా శాఖ సాహితీ, సంక్షేమ అదికారులు దయానంద రాణి, ఉపేందర్,శంకర్, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post