తేదీ.25.4.2022. సూర్యాపేట. అర్జీదారులు ధరఖాస్తులపై సత్వరమే స్పందించాలి. ఆదనవు కలెక్టర్ యస్. మోహన్ రావు.

అర్జీదారుల ధరఖాస్తులపై సత్వరమే స్పందించాలని అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి వివిధ రకాల భూ సమస్యలపై దరఖాస్తులు ఎక్కువగా అందుతున్నాయని ఆయా సమస్యలపై అర్జీదారులు నుండి దరఖాస్తులను స్వీకరించనైనదని అన్నారు. సంబంధిత శాఖల అధికారులు అట్టి దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి లో జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలని సూచించారు. ప్రజావాణిలో భూ సమస్యల పై 28, ఇతర శాఖలకు సంబంధించి 09 మొత్తం 37 దరఖాస్తులు అందాయని అట్టి దరఖాస్తులు పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను అదనపు కలెక్టర్ ఈ సందర్బంగా ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఐసీడీయస్ జ్యోతి పద్మ, ఎఫ్.డి.ఓ సౌజన్య, ఏ.ఓ శ్రీదేవి, పర్యవేక్షకులు సుదర్శన్ రెడ్డి, పులి సైదులు, అర్జీదారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post