తేదీ.25.4.2022. సూర్యాపేట. ఇఫ్తార్ లు ఐక్యతకు నిదర్శనం. రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.

రంజాన్ మాసంలో ఇఫ్తార్ లు ఐక్యతకు నిదర్శనమని
మంచి నడవడిక కోసం మహమ్మద్ ప్రవక్త బోధించిన మార్గాన్ని సుగమం చేసింది ‘ రంజాన్’ మాసమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం
సూర్యాపేట లోని జమ్మి గడ్డ , పోస్టాఫీసు పెద్ద మసీదు లలో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ
ఇఫ్తార్ విందు ‘ లలో ఆత్మీయత సహృద్భావాలు ప్రసుప్టమవుతాయని, పరస్పర ధోరణికి, విశాల ఆలోచనా దృక్పథానికి ఇవి నిదర్శనం అని మంత్రి అన్నారు. పండుగ ‘ అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే,దాని వెనుక ఒక సందేశం దాగి వుంటుందన్నారు. పండుగ ‘ మానావాళికి హితాన్ని బోధిస్తుందన్న మంత్రి  ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే ‘ రంజాన్ ‘ పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుందన్నారు.. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్టం లొ ఆయా మతాల కు అనుగుణగా ఏ కార్యక్రమం జరిగిన అందులో ప్రభుత్వం భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారాన్నరు. ఇందులో భాగంగా నే ప్రస్తుతం పవిత్ర రంజాన్ మాసం లో ప్రభుత్వం తరుపున ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశారన్నారు. ఇటువంటి దేశం లో తెలంగాణ లొ మినహా మరెక్కడా లేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులే కేసీఆర్ కు ముస్లీం సమాజం పట్ల ఉన్న ఆప్యాయత కు ప్రేమ కు నిదర్శనం అన్నారు. ఇప్పటికే మైనార్టీ లకోసం ఎక్కడా లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిన కేసీఆర్ భవిష్యత్ లోనూ మరెన్నో పథకాలు తెస్తారాన్నారు.
పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తూ ఉన్నాయన్నారు. పవిత్ర ఆరాధనలకు ధార్మిక చింతనకూ, దైవభక్తికీ, క్రమశిక్షణకూ, దాతృత్వానికి రంజాన్ నెల ఆలవాలం అవుతుందన్న మంత్రి మనిషి సత్ర్పవర్తన దిశలో సాగడానికి మహమ్మద్ ప్రవక్త బోధించిన మార్గాన్ని ‘ రంజాన్’మాసం సుగమం చేస్తుందన్నారు.. కార్యక్రమం లొ కో ఆప్షన్ రియాజ్, హఫీజ్ ఖలీల్,శాహెడ్ మౌలానా, గౌస్, ఉర్దూ ఘర్, శాదీ ఖనా చైర్మన్ కరాటే సయ్యద్, కౌన్సిలర్లు అన్నపెర్తి రాజేష్, రఫీ , గాయాసుద్దిన్, తహెర్ పాషా, జహీర్, ముస్లీం మత పెద్దలు పాల్గోన్నారు.

Share This Post