తేదీ.26.4.2022. సూర్యాపేట. లబ్దిదారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించాలి. శిబిరాల ద్వారా అవగాహన కల్పించాలి. కిసాన్ క్రెడిట్ కార్డులతో ఎన్నో అవకాశాలు. అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు.

జిల్లాలో రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు అందచేయాలని బ్యాంక్ అధికారులను అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంక్ అధికారులతో కేంద్ర పథకం కిసాన్ భగీ దారి ప్రాధమిక హమారి క్యాంపియన్ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కిసాన్ లబ్దిదారులందరికి క్రెడిట్ కార్డులు జారీచేసి పంటల, ఇతర రుణ సదుపాయాలు కల్పించాలని సూచించారు. రైతులు కిసాన్ కార్డులు పొందుటకు తమ పంట సాగు భూమి పట్టా, పంట వివరాలకు సంబందించిన జిరాక్స్ ప్రతులు అందచేస్తే బ్యాంక్ అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక కృషి చేయాలని బ్యాంక్ అధికారులకు సూచించారు. క్రెడిట్ కార్డులపై శిబిరాలు ఏర్పాటు చేసి లబ్దిదారులకు అవగాహన కల్పించాలని అన్నారు. ముక్యంగా వ్యవసాయం, పశు సంరక్షణ, మాత్యుశాఖ, రెవెన్యూ, పంచాయతీ శాఖలు అలాగే వివిధ ప్రాజెక్టుల అధికారులు కిసాన్ కార్డు ల వలన కలిగే లాభాలను లబ్దిదారులకు వివరించాలని సూచించారు. పి.యం. కిసాన్ పోర్టల్ ద్వారా సంబంధిత బ్యాంకులకు వెళ్లి క్రెడిట్ కార్డులు పొందవచ్చని అన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా పంట రుణాలే కాకా పశు సంపద, పాల ఉత్పత్తులు, గొర్రెలు, మేకల పెంపకం, అలాగే కోళ్లు,పందులు, బాతుల పెంపకం నకు కావలసిన పని మూలధన అవసరాలకు సంబంధించి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం పొందవచ్చని తెలిపారు.
ఈ సమావేశంలో యల్.డి.యం. విజయ్ భాస్కర్, నాబార్డ్ ఏ. జి.యం. సత్యనారాయణ, సీనియర్ మేనేజర్ UBI అబ్దుల్ సలాం, BOB మేనేజర్ బి. శ్రీను, డి.ఏ. ఓ రామారావు నాయక్, తదితరులు పాల్గొన్నారు.


Share This Post