తేదీ.26.9.21. సూర్యాపేట. వీరనారి చాకలి ఐలమ్మ జీవితం ఆదర్శనీయం. సాయుధ పోరాట ఉద్యమంలో అమే పాత్ర వెలకట్టలేనిది. సమాజ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి .

సాయుధ పోరాటం ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ సమాజ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి చాకలి ఐలమ్మ అని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బి.సి.సంక్షేమ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన 126వ జయంతి వేడుకలో జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి తో కలసి అమే చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధించుకున్న తర్వాత మన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించు కోవడం జరుగుతుందని, భూమి కోసం,భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన మహోన్నతమైన వ్యక్తి చాకలి ఐలమ్మ అని అమే జీవితం ఆదర్శనీయమమని అన్నారు. అమే సేవలను ఈ సందర్బంగా కొనియాడారు. అనంతరం అదికారులు,బి.సి. సంఘాల నాయకులు అమే చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు, అర్.డి. ఓ రాజేంద్ర కుమార్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పి. అన్నపూర్ణ , వైస్ చైర్మన్ …బి.సి. వెల్ఫేర్ అధికారి శంకర్, TNGOs జిల్లా కార్యదర్శి దున్న శ్యామ్, రజక సంఘ నాయకులు గట్టు నాగయ్య, చెరుకు వెంకన్న, జంపాల శ్రీను,జయమ్మ, నాగమణి, నాయి బ్రాహ్మణ నాయకులు వీరస్వామి ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post