తేదీ.27.12.2021. సూర్యాపేట. మెరుగైన అంగన్వాడీ సేవలు అందించాలి. స్మార్ట్ ఫోన్ల వినియోగం పై సిబ్బందికి అవగాహన కల్పించాలి. పోషణ నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. బాల రక్షా వాహనం ప్రారంభం. కరోనా కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టాలి. అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్.

జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలలో ఇకపై మెరుగైన సేవలు సులభతరంగా అందించనున్నట్లు అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ ఫోన్లు, చేరేలా పంపిణీ కార్యక్రమంలో పి.డి. ఐసీడీస్ జ్యోతి పద్మ తో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పిల్లలు, గర్భిణీ, బాలింతలకు లోప పోషణ నివారణ కోసం సరైన సమయంలో సరైన పోషణ అందించాలని ఇకపై సులభతరం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం మహిళ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆదిశగా ప్రతి ఒక్కరు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. సంబంధిత అధికారులు, సిబ్బంది 14 రకాల రిజిస్టర్ల పాత పద్దతిని నిలుపుదల చేసి సులభతరమైన సేవలు అందించాలని సూచించారు. సంబంధిత శాఖకు ఇటీవల సరఫరా చేసిన స్మార్ట్ ఫోన్లు, చీరెలను ఆయా కేంద్రాల వారీగా 1209 అంగన్వాడీ వర్కర్లకు, 48 మంది సూపర్ వైజర్లకు అలాగే 1209 మంది ఆయాలు, వర్కర్లకు చీరెలను ఈ సందర్బంగా అందచేశారు. ఇప్పటికే శాఖ పరంగా జిల్లా కో ఆర్డినేటర్ సంపత్ ఏ. సి. Dpo రూప లకు స్మార్ట్ ఫోన్ వినియోగం పై శిక్షణ ఇప్పించామని పేర్కొన్నారు. జిల్లాలో అన్ని కేంద్రాలలో పని చేస్తున్న సిబ్బందికి వీరిద్వారా పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం నూతన బలరక్ష వాహనాన్ని ప్రారంభించారు. జిల్లాలో విపత్తులో ఉన్న పిల్లల రక్షణకు వాహన సేవలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యoగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు కరోనా కట్టడికి తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని మూడో ముప్పుపొంచి ఉన్నందున అన్ని పిల్లల రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో cdpos, సూపర్ వైజర్స్, ఐసీడీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Share This Post