తేదీ.27.12.2021. సూర్యాపేట. సుప్రీం కోర్డు ప్రధాన న్యాయమూర్తి కి ఘన స్వాగతం. నల్గొండ ప్రిన్సిపల్ జిల్లా జడ్జ్ బి.యస్. జగ్జివన్ కుమార్, జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి యన్. వి. రమణకు నల్గొండ ప్రిన్సిపల్ జిల్లా జడ్జ్ బి.యస్. జగ్జివన్ కుమార్, జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి పూల గుచ్ఛాలు అందచేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పోలీసుల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. విజయవాడ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో హైద్రాబాద్ కుటుంబ సమేతంగా వెళుతూ సూర్యాపేట సెవెన్ హోటల్ నందు జిల్లా ఉన్నతాధికారులు ఇచ్చిన తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సూర్యాపేట అడిషనల్ జిల్లా జడ్జ్ వసంత కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కె. సురేష్, అడిషనల్ జూనియర్ జడ్జ్ ప్రశాంతి, యస్.పి. రాజేంద్ర ప్రసాద్, అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు, డి.యస్.పి. మోహన్ కుమార్, ఆర్.డి.ఓ రాజేంద్ర కుమార్, బార్ అసోసియేషన్ సభ్యులు , తదితరులు పాల్గొన్నారు.

Share This Post