తేదీ.27.9.21. సూర్యాపేట. అదికారులు అప్రమత్తంగా ఉండండి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. భారీ వర్షాలు నేపద్యంలో అన్ని జాగ్రత్తలు చేపట్టండి. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపద్యంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని మండల, జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు మూడు రోజులు అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలో వాగులు, వంకలు అలాగే మూసి వరద నీరుతో పొంగి ప్రవహించే అవకాశం ఉన్నందున ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని రెవెన్యూ, పోలీస్,విద్యుత్, వ్యవసాయ మరియు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలని ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఎప్పటికప్పుడు సమాచారం కలెక్టరేట్ కు అందించాలని సూచించారు.

Share This Post