తేదీ.28.12.2021. సూర్యాపేట. జిల్లాలో లోకల్ క్యాడర్ కేటాయింపులు పూర్తి. కౌన్సెలింగ్, కేటాయింపులు సజావుగా నిర్వహణ. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

 

జిల్లాలో లోకల్ క్యాడర్ కేటాయింపులు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆఫీస్ లో అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు తో కలసి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జిల్లాలో లోకల్ క్యాడర్ నియామకం, కౌన్సిలింగ్ ప్రక్రియ, ఉపాధ్యాయులు, అలాగే ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సమక్షంలో పూర్తి చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం ప్రక్రియ సజావుగా నిర్వహించి కేటాయింపులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ముందుగా జిల్లాలోని 36 వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు క్యాడర్ కేటాయింపు చేపట్టామని మొత్తం 718 మందికి స్థానిక కేటాయింపులు చేశామని అన్నారు. అన్ని శాఖల అధికారులు, ఉద్యోగుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి ఉద్యోగుల కేటాయింపు పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాజేంద్ర కుమార్, ఏ ఓ శ్రీదేవి, జిల్లా అధికారులు, ఉద్యోగులు, ఉపద్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post