తేదీ.3.6.2022. సూర్యాపేట. ప్రగతే మా లక్ష్యం. పల్లె, పట్టణ ప్రగతి లో అందరు బాగస్వాములవ్వాలి. తెలంగాణలో పల్లెలకు పట్టణాలకు మధ్యనే పోటి. అన్ని గ్రామాల్లో మౌళిక వసతుల కల్పన. అన్ని పట్టణాలు పరిశుభ్రఅంగా ఉంచాలి. రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.

 

ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన 5 వ విడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పట్టణాలు, గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని అందరి భాగస్వామ్యం ఎంతో అవసరమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ యావత్ దేశంలోనే ఏ రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్రానికి పోటీ లేదని తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలకు పట్టణాలకు మధ్యనే పోటీ ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో శుక్రవారం పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా 25, 39, 9, 36 వార్డులతో పాటు పెన్ పహడ్ మండలంలో నిర్వహించిన పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మంచి నాగరిక సమాజంలో తెలంగాణ సమాజం తయారు కావాలన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో మనం ఎన్నో కలలు కన్నామని రాష్ట్రం వస్తే ఎట్లా ఉంటుందని.. ఎట్లా ఉండాలనే దానికి ఇవాళ ఎనిమిదేండ్ల కేసీఆర్ పాలన బాటలు వేసి సంపూర్ణ విజయాన్ని సాధించిందన్నారు. అతి చిన్న రాష్ట్రమైన, వయసులో తక్కువ అయినా భారతదేశంలో ఉన్న మిగతా అన్ని రాష్ట్రాల్లోకెల్లా తెలంగాణ ఒకడుగు పైన నిలబడిందన్నారు. పెన్ పహాడ్ మండలం ధర్మపురం పల్లె ప్రగతిలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ సభ నిర్వహించారు. గ్రామాలలో ఉన్న సమస్యలపై గ్రామ సభ ద్వారా సమస్యలను సత్వరమే పరిష్కరించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. మిషన్ భగీరథ నీరు వచ్చే శుక్రవారం నాటికి అందేలా సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో మిషన్ భగీరథ ప్ 5 వేల అన్ని నియోజక వర్గాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా నీటి సరఫరా ఉండాలని అన్నారు. పల్లె ప్రగతిలో ఈసారి ఎక్కువగా అటవీ జాతి మొక్కలు నాటాలని, ఇరిగేషన్ భూములలో శాస్త్రీయ పద్దతిలో 40 లక్షల మొక్కలు నాటాలని అలాగే అక్రమనలో ఉన్న భూములను గుర్తించి వాటిలో కూడా విరివిగా నాటాలని ఆదేశించారు. కోట్లతో చేపట్టసమని దేశంలో ప్రతి ఇంటికి మంచినీరు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అని చెప్పుకునే పరిస్థితి, ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా అన్ని గ్రామ పంచాయతీల్లో రైతు వేదికలు, ట్రాక్టర, ట్రాలీ, ట్యాంకర్లు కలిగి ఉన్నది ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రమని అన్నారు. ప్రతి గ్రామం సెగ్రిగేషన్, చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసుకుని తడి పొడి చెత్త సేకరణ వేరు చేస్తూ ఆ చెత్త నుంచి కూడా ఆదాయాన్ని గ్రామ పంచాయతీలు పొందుతున్నారని ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఉందన్నారు. పట్టణాల్లో కూడా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తూ వైకుంఠ ధామాలు, పట్టణ ప్రకృతి వనాలు, ప్రతి నిత్యం మంచినీరు అందించే సురక్షితమైన మంచినీటి పథకాలు ఉన్నాయన్నారు. అన్నింటికి మించి మానవ జీవితానికి అత్యంత అవసరమైన ఆక్సిజన్ అందించే చెట్ల పెంపకం, అడవుల పెంపకం పట్టణాల్లో ఎటు చూసినా పచ్చదనం కనపడుతుందని ఇది తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది ఏండ్ల కాలంలో కెసిఆర్ గారి నేతృత్వంలో జరిగిన అభివృద్ధి అన్నారు. దేశంలో ఇరవై గ్రామాల్లో ఏవి బాగున్నాయని లెక్కతీస్తే తెలంగాణలో 19 గ్రామాలు ఉంటాయన్నారు. తెలంగాణ అభివృద్ధిని దాచిపెడదామని కనపడనీయకుండా చేద్దామని ప్రయత్నించే వాళ్లు కూడా ఒప్పుకోక తప్పని పరిస్థితిలో తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు. చేసింది చాలనీ అనుకోకుండా ఇంకా ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పల్లె పట్టణ ప్రాంతాల్లో మెరుగైన సౌకర్యాలు అందించాలని పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. భారత దేశంలో ఏ రాష్ట్రంతో కూడా తెలంగాణకు పోటీ లేదని తెలంగాణలో పల్లెలకు పట్టణాలకు మధ్యనే పోటీ ఉందని ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ప్రజా ప్రతినిధులంతా కృషి చేస్తున్నారని అన్నారు. ఒకరికి ఒకరు పోటీ పడి పల్లె బాగుండాలి మా పట్టణం బాగుండాలని కోరుకుంటున్నారని అన్నారు. ఇవాళ విదేశాలకు పోయినవాళ్లు, గ్రామాలను వదిలి పెట్టి పట్టణాలకు వలస వెళ్లినవారు ఇవాళ మళ్ళీ వాళ్ళ జాడలు వెతుక్కుంటూ గ్రామాలకు వస్తున్నారని అన్నారు. నేడు గ్రామాల్లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని మురికి కాలువలు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మేమున్నామంటూ ఈ గ్రామాల్లోనే ఉంటామంటూ వస్తున్నారంటే ఇన్నేళ్ల కాలంలో కెసిఆర్ సృష్టించిన అద్భుతమైన పాలన ఇది అన్నారు. ప్రభుత్వం కేవలం పథకాలను మాత్రం తీసుకువస్తుందని వాటిని అమలు చేయడంలో అధికారుల కృషి చాలా ఉంటుందని అన్నారు. తెలంగాణలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారులు ప్రతి పథకం విజయవంతానికి కృషి చేస్తున్నారని అన్నారు. పంపిణీ చేశారు. అనంతరం నూర్జహాన్ పెట లో దళిత బందు కింద 18 మంది లబ్దిదారులకు యూనిట్లను అలాగే కల్యాణ లక్ష్మీ పథకం కింద 71 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను అందచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట MP బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్, ceo సురేష్, పి.డి కిరణ్ కుమార్, డి.పి.ఓ యాదయ్య, ఉద్యాన అధికారి శ్రీధర్ గౌడ్, స్పెషల్ అధికారి రాంపతి నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ నెమ్మది బిక్షం, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, తెశశిల్దార్లు, ఎంపీడోలు, అయా వార్డుల కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Share This Post