తేదీ.30.5.2022. సూర్యాపేట. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి. అన్ని కేంద్రాలలో మౌళిక వసతులు కల్పించండి. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

జిల్లాలో జూన్ 12న నిర్వహించే టెట్, ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం తన ఛాంబర్ లో టెట్, ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో భాగంగా అన్ని కేంద్రలలో మౌళిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని టెట్ పరీక్ష నిర్వహణకు నాలుగు మున్సిపాలిటీ ల పరిధిలో 58 కేంద్రాలలో 13600 మంది పరీక్ష రాయనున్నట్లు ఆదిశగా అన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణ సమయంలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని కేంద్రాల్లో మౌళిక వసతులు కల్పించడంతో పాటు సి.సి. కెమెరాలను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యానంగా అన్ని కేంద్రాలలో త్రాగునీరు, నిరంతగా విద్యుత్తు, ప్రతి కేంద్రంలో ఒక ANM లను తప్పక ఉండేలా చూడాలని అన్నారు. పరీక్షలలో భాగంగా నియమించిన అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పక పాటించాలని, లేనియెడల చర్యలు తప్పవని హెచ్చరించారు. తేదీ 31.5.2022 నుండి 16.6.2022 వరకు జరిగే ఓపెన్ టెన్త్ లో 1002 మంది కి జిల్లాలో సూర్యాపేటలో 2 కేంద్రాలు, కోదాడలో 1, అలాగే హుజూర్ నగర్ లో 2 కేంద్రాలు మొత్తం 5 కేంద్రాలను అలాగే తేదీ. 31.5.2022 నుండి 18.6.2022 వరకు ఇంటర్ లో 1159 మంది కి సూర్యాపేటలో 2 కేంద్రాలు,కోదాడ 2, హుజూర్ నగర్ లో 2 మొత్తం 6 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. రూట్ అధికారులుగా మండల తహశీల్దార్లు విధులు నిర్వహిస్తారని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రూట్లవారిగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకొని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సూర్యాపేటలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచాలని అదేశించారు. నియమించిన అధికారులు, సిబ్బంది నిబ్బద్దతతో పనిచేయాలని ఈ సందర్బంగా సూచించారు. అన్ని కేంద్రలలో ఆయా జి.పి. లనుండి శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో DEO అశోక్, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనయ్య, DMHO dr. కోటా చలం, విద్యుత్, పోలీస్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post