తేదీ.30.5.2022. సూర్యాపేట. పల్లె ప్రగతి విజయవంతం చేయాలి. పంచాయతీ రాజ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయా, కమిషనర్ ఏ. శరత్. జిల్లాలో చేపట్టే పల్లె ప్రగతి ఏర్పాట్లు పూర్తి. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

జిల్లాలలో జూన్ 3 నుండి 18 వరకు చేపట్టే పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సందీప్ కుమార్ సుల్తానీయా, కమిషనర్ ఏ. శరత్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాల్లో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టే పనులపై దిశా నిర్దేశ్యం చేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో చేపట్టే5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో జూన్ 3 నుండి 18 వరకు చేపట్టే వివిధ పనిలపై మండల అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులతో సమావేశాలు నిర్వహించి దిశా నిర్దేశ్యం చేయడం జరిగిందని తెలిపారు. పల్లెలలో గుర్తుగించిన పనులను 15 రోజులలో పూర్తి చేయడం జరుగుతుందని గ్రామ, మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించమని వివరించారు. ముఖ్యానంగా పల్లె ప్రగతిలో వైకుంఠ దామాలలో మిగిలి ఉన్న పనులు, అలాగే తడి పొడి చెత్త కేంద్రాల నిర్వహణ పై, నర్సరీలు, హరితహారం అలాగే పారిశుధ్యం పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు అలాగే ప్రజా ప్రతినిధులు తప్పక పాల్గొనేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. జిల్లాలో క్రీడా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటికే 52 క్రీడా మైదానాలను గ్రౌండింగ్ చేశామని ఈ సందర్బంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, డిపిఓ యాదయ్య, పి.డి. కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post