తేదీ.30.8.2021. సూర్యాపేట. అధిక వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆస్తి, ప్రాణ నష్టం వాటిలకుండా పటిష్ట చర్యలు గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి. లోతట్టు ప్రాంతాలో ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్.

రాష్ట్ర వ్యాప్తంగా భారీవర్షాల కురుస్తాయనే వాతావరణ శాఖ సమాచారం దృశ్యా జిల్లాలోని అధికారులు అప్రమత్తంగా వుండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సంబంధిత అధికారులనుఆదేశించారు. సోమవారం భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యల పై డి.జి.పి. మహేందర్ రెడ్డి ఇతర శాఖల ఉన్నతాధికారులతో కలసి హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయె పలు రోజులో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీని వల్ల నది పరివాహక ప్రాంతాలో ప్రాంతాల్లో వరద ఉదృతి పెరుగుతున్నందున యుద్ద ప్రాతిపదికన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ లను, సంబంధిత శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. జిల్లాలలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకొని తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను ,ఎస్పీలను, రెవిన్యూ అధికారులు, ఆర్ అండ్ బీ శాఖ అధికారులను సిఎస్ ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రాజేక్టులు, చెరువులు, వాగులు వంకలన్నీ నిండా ఉన్నాయని, వచ్చే వర్షాల వల్ల అవి ఉద్రుతంగా ప్రవహించే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. రాష్ట్రంతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున నేపథ్యంలో అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో వరద ఉదృతి పెరగనున్నదని తెలిపారు. రానున్న రెండు రోజులు అతి భారీ స్థాయిలో వర్షాలు కురిసే పరిస్థితిల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా వుంటూ ఎవరి జాగ్రత్తలు వాళ్లు తీసుకోవాలని సీఎస్ పిలుపునిచ్చారు. మున్సిపల్, పంచాయితి రాజ్ అధికారులు గ్రామ పరిదిలో పురాతన శిథిల భవనాలు, గోడలు కులే పరిస్థితులు ఉన్నట్లైతే, వాటిని గుర్తించి నివాసితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువులు, వివిధ ప్రాజేక్టుల కాల్వలు పూర్తి స్థాయిలో నీరు ఉన్నందున చెరువులు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు గ్రామలోని లోతట్టు వంతెనల వద్ద నీటి ప్రవాహం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నీటి ప్రవహం అధికమైనట్లయితే దారులను మూసివేసి బారికేడ్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. విద్యుత్ పునరుద్దరణ చర్యలు వేగవంతంగా చేపట్టాలని, విద్యుత్ వైర్లు తెగి పడిపోయినట్లయితే వెంటనే మరమత్తులు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని లోతట్టు ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, దీని కోసం సమీపంలో క్యాంపులు ఏర్పాటు చేయాలని సిఎస్ ఆదేశించారు . జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్థి మరియు జంతు నష్టం వాటిలకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్నతాధికారులంతా వారి హెడ్ క్వార్టర్ లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. గ్రామాలో సర్పంచ్ లు, పంచాయతి కార్యదర్శులను రాబోయె 3 రోజులు అప్రమత్తంగా ఉంచాలని, స్థానికంగా అందుబాటులొ ఉండే విధంగా సమాచారం అందించాలని సీఎస్ తెలిపారు. ఈ రోజు సాయంత్రం నుంచి రాబోయె 2 లేదా 3 రోజులు కురిసే భారీ వర్షాల పై గ్రామాలో డప్పు చాటింపు వేయాలని తెలిపారు.

అనంతరం జిల్లా కలెక్టరు టి. వినయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వలన ఇప్పటికే సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి ఎలాంటి నష్టం వాటిల్లకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని సూచించడం జరిగిందని తెలుపుతూ జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు సమన్వయంతో కలసి పనిచేయాలని తెలపడం జరిగిందని వివరించారు.
ఈ కాన్ఫరెన్స్ లో యస్.పి. bhaskaran, అదనపు కలెక్టర్లు యస్. మోహన్ రావు, పాటిల్ హేమంత్ కేశవ్, నీటిపారుదల ఈ. ఈ. బద్రు నాయక్, పి.అర్. ఈ. ఈ. వెంకటేశ్వర్లు, డి. ఏ. ఓ రామారావు నాయక్, మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post