తేదీ.31.5.2022. సూర్యాపేట. సహజ ప్రసవాలు జరిగేలా చూడాలి. ప్రభుత్వ ఆరోగ్య పధకాలను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

 

ప్రభుత్వ ఆసుపత్రులలో సహజ ప్రసవాలు ఎక్కువ జరిగేలా చూడాలని వైద్యాధికారులు లను జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశించారు. మంగళవారం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో జరిగిన జిల్లా ఆరోగ్య సొసైటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైద్యాధికారులు గర్భిణీ స్త్రీల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రిలో నైనా తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో సహజ ప్రసవాల కొరకు జాగ్రత్తలు తీసుకోవాలని, సాధారణ ప్రసవం వల్ల మహిళల ఆరోగ్యం మెరుగుపడుతుందని, మహిళలు రక్తహీనతకు గురికాకుండా ఎప్పటికప్పుడు సమతుల్య ఆహారం తీసుకుంటూ వైద్యుల సూచనలు సలహాల ప్రకారం జాగ్రత్తలు పాటిస్తే సాధారణ ప్రసవం అయ్యే అవకాశం ఉందని అన్నారు. క్షయ నిర్ధారణ కొరకు తెమడ పరీక్షలు నిర్వహించాలని అన్నారు. వర్షాకాలం వచ్చే అవకాశం ఉందని ముఖ్యంగా కీటక జనిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, దోమలు పుట్టకుండా కుట్టకుండా చూసుకోవాలి అని తెలియజేశారు. అన్ని ఆసుపత్రులలో ఆయుష్మాన్ భారత్ కింద చికిత్సలు ప్రారంభించాలని , వైద్యాధికారులకు ఈ దిశగా అవగాహన కల్పించాలని సిబ్బందిని కోరారు. విలేజ్ హెల్త్ రిజిస్టర్ లో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి వివరాలు ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. బీపీ షుగర్ పరీక్షలు మరియు నోరు , రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి.యం.హెచ్.ఓ లు డాక్టర్ హర్షవర్ధన్, డాక్టర్ నిరంజన్, జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ సాహితీ, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ శ్రీనివాస్ రాజు, డాక్టర్ నాజియా, డెమో అంజయ్య , డి.పి.ఓ కిరణ్, అసంక్రమిత వ్యాధుల జిల్లా కో ఆర్డినేటర్ బూత రాజు సైదులు, భాస్కర రాజు,యమున, బిచ్ఛు నాయక్, సురేంద్ర, ఉపేందర్, కృష్ణ తదితరులు ఉన్నారు.*

Share This Post