*తేదీ.6.6.2022. సూర్యాపేట. పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరు బాగస్వాములవ్వాలి. పట్టణ ప్రగతి ద్వారా అన్ని వార్డులలో మెరుగైన అభివృద్ధి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో బాగంగా నాలుగో రోజు స్థానిక 7,21,22,31 వ వార్డులలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ తో కలసి రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపనలు అలాగే మందుల వాడాలో రూ.60 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సంధర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లెలు పట్టణాలలో సమస్యలు పరిష్కరించేందుకు పట్టణ ప్రగతి ప్రజల కార్యక్రమమని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టారన్నారు. పట్టణ ప్రగతిలో ప్రజలంతా భాగస్వాములై తమతమ వార్డులలో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంత క్రీడాకారులకు క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తుందన్నారు. అందులో భాగంగా ఇప్పటికే 40 పూర్తి చేసుకున్నామని మిగతా క్రీడా మైదానాల పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. సూర్యాపేట పట్టణము అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతూ రాష్ర్టానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. చెత్తను వేరు చేయడం తో పాటు రోడ్లపై చెత్త లేకుండా ఎవరి ఇంటి ముందు వారు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సూర్యాపేట పట్టణాన్ని సుందరమైన, ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రంధాలయా సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, ఈ ఈ జి డి కే ప్రసాద్, డి ఈ సత్యారావు, మెప్మా పిడి రమేష్ నాయక్, వార్డు కౌన్సిలర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post